Share News

Viral: పాము, ముంగిస మధ్య జాతి వైరం ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Dec 11 , 2024 | 08:38 PM

పాము ముంగిస మధ్య జాతి వైరం జగత్ విఖ్యాతం. అనేక భాషల సాహిత్యంలో కవులు రచయితలు, వీటి మధ్య వైరాన్ని పేర్కొన్నారు. ఈ వైరం వెనక పలు కీలక కారణాలు ఉన్నాయని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Viral: పాము, ముంగిస మధ్య జాతి వైరం ఎందుకో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: పాము ముంగిస మధ్య జాతి వైరం జగత్ విఖ్యాతం. అనేక భాషల సాహిత్యంలో కవులు రచయితలు, వీటి మధ్య వైరాన్ని పేర్కొన్నారు. అయితే, ఈ వైరం వెనక పలు కీలక కారణాలు ఉన్నాయని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంట పడగానే చంపేంత వైరం వెనక కారణాలు ఏవంటే (Viral)..

Viral: ఎయిర్‌పోర్టులోనూ ఇదే దుస్థితా! రూ.200 పెట్టి పకోడీలు కొంటే..


వైరం వెనక..

ఈ రెండు జీవుల మధ్య వైరం వెనక బతుకుపోరాటం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రెండూ జంతువులు వేటాడి కడుపు నింపుకునేవే. ఓ ప్రాంతాన్ని తమదిగా చేసుకుని జీవిస్తుంటాయి. తమ ఇలాకాలోకి ఇతర జీవాలు వస్తే సహించవు. ఇక పాము ముంగిసలైతే ఒకదాన్ని ఒకటి చంపుకునేందుకే ప్రయత్నిస్తాయి. దీంతో, అవతలి జీవి కనిపిస్తే చాలు ముందుగా దాడి చేసి మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఇది చాలదన్నట్టు, పాము ముగింసలు తమ సంతానానికి అవతలి జీవితో ప్రమాదం ఉందని భావిస్తాయి. పాములు ఇతర పిల్ల జంతువులను ఆహారంగా స్వీకరిస్తాయి. దీంతో, పాములతో తన సంతానికి అపాయం తప్పదన్న భయం ముంగిసను నిత్యం వేటాడుతుంటుంది. దీంతో, రెండో ఆలోచన లేకుండా ముంగిసలు పాములపై దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Viral: అద్భుతం.. ఏనుగులను రైలు ఢీకొనకుండా కాపాడిన ఏఐ కెమెరా!


అయితే, పాము ముంగిసలకు సంబంధించి 80 శాతం పోరాటాల్లో ముంగిసే విజయం సాధిస్తుంది. ముంగిస పరిణామక్రమమే ఇందుకు కారణం. పాము విషాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ముంగిస సంతరించుకుంది. కణాలపై ఉండే ఎసటైల్ కోలిన్ రిసెప్టర్‌లపై ప్రభావం చూపించే పాము విషం చివరకు అన్ని అవయవాలు చచ్చుబడేలా చేసి మృత్యువుకు కారణమవుతుంది. అయితే, ముంగిసల్లోని ఎసటైల్ కోలిన్ రిసెప్టర్‌లు ప్రత్యేకమైనవని, వాటిపై విషం ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక మెరుపు వేగంతో కదిలే ముంగిస పాము కాటు నుంచి సులువుగా తప్పించుకోగలదట. దీంతో, పాటు ముంగిసలోని ఆల్ఫా, బీటా బ్లాకర్స్ కూడా విషాన్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయి. అయితే, భారీ విషపూరిత పాములకు మాత్రం ముంగిసలకు చంపే సామర్థ్యం ఉంటుందట. గట్టి కాటు వేయడంతో పాము శరీరంలోని భారీస్థాయిలో విషాన్ని ప్రవేశపెట్టి అవి ముంగిసలను మట్టుపెడతాయని నిపుణులు వివరిస్తున్నారు.

Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్

Read Latest and Viral News

Updated Date - Dec 11 , 2024 | 08:42 PM