Share News

Viral: సోడా క్యాన్లు అన్నింటికీ ఒకే డిజైన్ ఎందుకుంటుందో తెలుసా?

ABN , Publish Date - Nov 04 , 2024 | 10:01 PM

అన్ని బ్రాండ్ల సోడా క్యాన్‌లను ఒకే ఆకారంలో రూపొందించడం వెనక సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజైన్‌..లోపలి పీడనాన్ని సమర్థవంతంగా తట్టుకోగలదని చెబుతున్నారు.

Viral: సోడా క్యాన్లు అన్నింటికీ ఒకే డిజైన్ ఎందుకుంటుందో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: మీరెప్పుడైనా సోడా క్యాన్‌ల డిజైన్‌ను పరిశీలించారా? అల్యూమినియంతో చేసే ఈ క్యాన్‌లు దాదాపుగా ఒకే డిజైన్‌లో కనిపిస్తుంటాయి. క్యాన్ అడుగు భాగం సొట్టలా లోపలికి ఉండి, దాని చుట్టూ ఉబ్బెత్తుగా ఓ రింగు కూడా ఉంటుంది. ఏ బ్రాండ్ సోడా క్యాన్ అయినా దాదాపు ఇలాగే ఉంటుంది. మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు తహతహలాడే కంపెనీలు అన్నీ ఒకే తరహా డిజైన్ ఎందుకు వాడుతున్నాయనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే.. ఈ కథనం మీకోసమే. సోడా క్యాన్‌లు ఈ ఆకృతిలో డిజైన్ చేయడం వెనక పలు సాంకేతిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Viral).

Viral: వామ్మో.. ఎవర్రా మీరంతా! బెర్త్‌ దొరకలేదని రైల్లో వీళ్లేం చేశారో చూస్తే..


సోడా అంటేనే కార్బన్‌డైఆక్సైడ్ కరిగిన నీరు. అధిక పీడనం వద్ద మాత్రమే నీటిలో కార్బన్‌డైయాక్సైడ్ కరుగుతుంది. సాధారణ పీడనం వద్ద ఈ కార్బన్‌డైఆక్సైడ్ వాయు రూపంలో నీటి నుంచి బయటకు వచ్చేందుకు. కాబట్టి సోడాను అధిక పీడనం వద్ద క్యాన్‌లో నిల్వ ఉంచుతారు. కాబట్టి, క్యాన్స్ తెరిచిన వెంటనే సోడా ఒక్కసారిగా బయటకు పొంగుతుంది. అయితే, అల్యూమినియంతో చేసే సోడా క్యాన్లు అంత దృఢమైనవి కావు. చేతితో గట్టిగా వత్తితనేనే నలిగిపోతాయి. ఇలాంటి క్యాన్లు సోడా కారణంగా జనించే పీడనాన్ని తట్టుకుని నిలబడాలంటే దాని అడుగుభాగాన్ని ఇలా సోట్ట పడ్డ ఆకారంలో డిజైన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకృతి వాటికి క్యాన్‌లకు మరింత స్థిరత్వాన్ని ఇస్తాయట.

Viral: వామ్మో.. ఎవర్రా మీరంతా! రైల్లో బెర్త్‌ దొరకలేదని వీళ్లేం చేశారో చూస్తే..


ఇక క్యాన్ అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న రింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేక కారణం ఇది. ఈ డిజైన్‌తో క్యాన్‌లను ఒకదానిపై మరొకటిని సులభంగా నిలబెట్టొచ్చు. దీంటో, కార్టన్‌లలో వీటిని పెట్టి తరలించడం మరింత సులభం అవుతుందట.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ప్రస్తుత డిజైన్ ఈ మధ్య కాలంలోనే ఉనికిలోకి వచ్చిందట. అంతకుముందు, ఈ క్యాన్‌ల అడుగు భాగం బల్లపరుపుగానే ఉండేదట. అయితే, 1967 నుంచీ క్యాన్‌ల తయారీ కోసం పెప్సీ, కోకోకోలా లాంటి కంపెనీలు అల్యూమినియం వాడటం మొదలుపెట్టాయట. నాటి నుంచీ క్యాన్‌ల ఆకృతిలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అల్యూమినియం క్యాన్‌లు సగటున ఒక చదరపు అంగుళంపై 90 పౌండ్ల మేర ఒత్తిడిని తట్టుకుంటాయి. అయితే, క్యాన్‌లను గుండ్రంగా చేస్తే అవి మరింత సమర్థవంతంగా పీడనాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Nov 04 , 2024 | 10:01 PM