Share News

Viral: లాంగ్ జర్నీల్లో కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంటున్నారా? కారణం ఇదే!

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:49 PM

లాంగ్ జర్నీల్లో ప్రయాణికులు నిద్రలోకి జారుకోవడానికి పలు శారీరక, మానసిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Viral: లాంగ్ జర్నీల్లో కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంటున్నారా? కారణం ఇదే!

ఇంటర్నెట్ డెస్క్: ఏవైనా దూర ప్రాంతాలకు వెళ్లుతున్నప్పుడు కొందరు వాహనాల్లో తెగ నిద్రపోతుంటారు. కారు, రైలు, బస్సు.. ఇలా వాహనం ఏదైనా సులువుగా నిద్రలోకి జారిపోతుంటారు. మీకూ ఈ అలవాటు ఉందా? అయితే, దీని వెనక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి అవేంటో..అసలు వాహనం ఎక్కగానే అలా నిద్ర ఎందుకు ముంచుకొస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు నిద్ర ముంచుకురావడానికి వ్యక్తిగత, పరిసరాలకు సంబంధించిన పలు అంశాలు కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. వాటిల్లో ముఖ్యమైనది లయబద్ధమైన కదలికలట. కార్లు లేదా రైళ్లో ఒకే వేగంలో వెళుతున్నప్పుడు లయబద్ధంగా కదులుతాయి. ఉయల్లో పడుకోబెట్టిన చిన్నారులు చట్టుకున్న నిద్రలోకి జారుకున్నట్టు ఈ లయబద్ధ కదలికలు పెద్దలను కూడా నిద్రపుచ్చుతాయట.


Health: 2 నెలల్లో 7 కిలోలు తగ్గిన యువతి! ఒకే ఒక సింపుల్ ట్రిక్‌తో..

ఇక వాహనాలు ఒకే వెళుతున్నప్పుడు మంద్రంగా వినబడే శబ్దాలు కూడా నిద్రకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఒకే రకమైన దృశ్యాలు కంటికి కనబడుతుండటంతో మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. ఇదే చివరకు నిద్రకు దారి తీస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

కార్లు, రైళ్లో కూర్చున్నప్పుడు కాంతి తక్కువగా ఉంటుంది. మనుషులకు నిద్ర రావాలన్నా మేలుకోవాలన్న సూర్యరశ్మీ అవసరం. సూర్యకాంతి ఆధారంగానే మనుషుల్లో జీవగడియారం పనిచేస్తుంది. కాబట్టి, కాంతితక్కువగా ఉన్నప్పుడు జీవగడియారం కూడా తికమకపడుతుంది. ఫలితంగా మనల్ని నిద్ర ఆవరిస్తుంది.


Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!

శారీరకంగా, మానసికంగా అలసిపోయిన వాళ్లు కూడా ప్రయాణాల సందర్భంగా త్వరలో నిద్రలోకి జారుకుంటారు. అసలే అలసట, ఆపై నిద్రకు అనువైన పరిస్థితుల కారణం శరీరం వెంటనే నిద్రకు సిద్ధమైపోతుంది. దొరికిందే అవకాశం అన్నట్టు ఈ జర్నీలోనే నిద్రమొదలై మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.

ఇక మెదడు యాక్టివ్‌గా ఉన్నంత సేపు నిద్ర దరిచేరదు. అయితే, ప్రయాణాల సందర్భంగా చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి మెదడుకు క్రియాశీలత తగ్గి క్రమంగా నిద్రలోకి జారుకుంటామట. అయితే, జర్నీల సందర్భంగా తోటి ప్రయాణికులు లేదా స్నేహితులతో మాటలు లేదా ఆడియో బుక్స్ వినడం వంటివి చేస్తే ఈ నిద్రరాదని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే, అందరూ ఇలా జర్నీల్లో నిద్రపోతారని కూడా నిపుణులు చెబుతుంటారు. ఇది వారి వారి మానసిక శారీరక తీరుతెన్నుల బట్టి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Nov 03 , 2024 | 01:50 PM