Sunday Holiday: మన దేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చింది? 134 ఏళ్ల క్రితం ఉద్యమం ఎలా మొదలైందో తెలుసా?
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:40 PM
ఆదివారం వచ్చిందంటే చాలు.. స్కూలు పిల్లల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ రిలాక్స్ అయిపోతుంటారు. సెలవు రోజును చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. వారమంతా పని చేసి చివరి రోజున విరామం ఇస్తారు. ఇక అందరికీ ఇష్టమైన ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా?
ఆదివారం (Sunday) వచ్చిందంటే చాలు.. స్కూలు పిల్లల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ రిలాక్స్ అయిపోతుంటారు. సెలవు (Holiday) రోజును చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. వారమంతా పని చేసి చివరి రోజున విరామం ఇస్తారు. ఇక అందరికీ ఇష్టమైన ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా.? ముఖ్యంగా మనదేశంలో ఆదివారం సెలవు (Sunday Holiday) ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.? దాని వెనుక పెద్ద హిస్టరీ ఉంది. దేశ స్వాతంత్ర్యం కంటే పురాతన చరిత్ర ఉంది (Viral News).
భారతదేశంలో ఆదివారం సెలవు వెనుక పోరాట కథ ఉంది. భారతదేశంలో ఎప్పట్నుంచో బ్రిటిష్ వారి క్యాలెండర్‌నే పాటిస్తున్నారు. మనదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం (British Government) అధికారంలో ఉన్నప్పుడు, ఇంగ్లీష్ అధికారులు వారంలో ఆరు రోజులు పని చేసి ఆదివారం చర్చికి వెళ్లేవారు. అయితే మన దేశానికి చెందిన కూలీలు మాత్రం వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి వచ్చింది. అంటే ఒక్కరోజు కూడా సెలవు లేదు. కార్మికుల దుస్థితిని అప్పటి కార్మిక సంఘం నాయకుడు నారాయణ్ మేఘాజీ లోఖండే (Narayan Meghaji Lokhande) అర్థం చేసుకున్నారు.
వారంలో ప్రతి ఆదివారం కార్మికులకు సెలవు కావాల్సిందే అంటూ లోఖండే పోరాటం మొదలుపెట్టారు (Movement for Holiday). మొదట్లో బ్రిటీష్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. దీంతో లోఖండే ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం అప్రతిహతంగా 8 ఏళ్ల పాటు సాగింది. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం దిగి వచ్చింది. 1889లో లోఖండే ప్రతిపాదనను అంగీకరించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. అప్పట్నుంచి ఆదివారం అనేది సెలవు దినంగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..