Viral: నిత్యం కారు నడిపే వ్యక్తి.. ఐదేళ్లుగా హారన్‌యే కొట్టలేదు! ఎందుకంటే..
ABN , Publish Date - Jun 27 , 2024 | 08:59 PM
బీహార్‌కు చెందిన ఓ మాజీ ఇంజినీర్ గత ఐదేళ్లుగా హారన్ మోగించలేదు. ధ్వని కాలుష్యంతో కలిగే నష్టాలు స్వయంగా తెలుసుకున్న ఆయన ఆ తరువాత వాహనం నడిపేటప్పుడు హారన్ కొట్టడం మానేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు మీదకు వెళ్లామంటే చాలు రణగొణధ్వనులతో చెవులు చిల్లులు పడుతుంటాయి. ముఖ్యంగా, వాహనదారులు చీటికీమాటకీ హారన్ మోగిస్తుంటారు. అనేక మందికి ఇది అలవాటుగా మారిపోవడంతో నగరాల్లో ధ్వని కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను గత ఐదేళ్లుగా హారన్ కొట్టలేదంటున్నాడు. ప్రస్తుతం ఇది దేశ్యాప్తంగా సంచలనంగా (Viral) మారింది.
Shocking: ధూమపానంతో గొంతుక లోపల వెంట్రుకల పెరుగుదల!
గౌతమ్ రంజన్ అనే వ్యక్తి యూనైటెడ్ నేషన్స్‌లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు కారు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. నిత్యం తనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఏదోక చోటకు వెళ్లి వస్తుంటారు. అయితే, ఓసారి ఎదురైన అనుభవంతో ఆయన మరెన్నడూ హారన్ మోగించొద్దని నిర్ణయించుకున్నారు (Why This Bihar Man Has Not Honked In The Last 5 Years).
2018లో ఓసారి ఆయన బస్‌స్టాప్‌లో వేచి చూస్తుండగా వాహనాల హారన్ శబ్దాల కారణంగా ఆయనకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. అలాంటి పరిస్థితి ముందెన్నడూ ఆయనకు ఎదురు కాలేదు. దీంతో, ధ్వని కాలుష్యంతో కలుగుతున్న నష్టాల నుంచి ఆయన స్వయంగా తెలుసుకున్నట్టైంది. అయితే, ఈ పరిస్థితిలో మార్పు రావాలని భావించిన ఆయన స్వయంగా ఈ దిశలో తొలి అడుగు వేశాడు. కారులో వెళ్లినప్పుడు హారన్ మోగించొద్దని నిర్ణయించుకున్నారు. అది మొదలు 2019 నుంచి ఇప్పటివరకూ ఆయన ఎప్పుడూ హారన్ మోగించలేదు.
మనిషి కనీసం 50 డెసిబెల్స్ ఉన్న శబ్దాలనే మనిషి వినగలడని ఆయన చెబుతున్నారు. ఇంతకు మించిన తీవ్రతో శబ్దాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని వాపోయారు. ఈ శబ్దాలతో ఆందోళన, ఒత్తిడి మొదలు దీర్ఘకాలంలో అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయన్నారు. అయితే, మంచి మార్పు ఏదైనా తనతోనే మొదలవ్వానే సిద్ధాంతం ఉన్న ఆయన ఆ తరువాత డ్రైవింగ్ లో ఉన్నప్పుడు హారన్ మోగించడం మానేశారు. దాదాపు ఐదేళ్లుగా ఆయన ఇదే పంథాలో ఇతర వాహనదారులకు ఆదర్శప్రాయంగా కొనసాగుతున్నారు.