Share News

Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:42 PM

లాటరీలో ఏకంగా రూ.121 కోట్లు గెలుచుకున్న ఓ ఐర్లాండ్ మహిళ ఆ డబ్బు మొత్తాన్ని ప్రజాసేవ కోసం వినియోగించడం సంచలనంగా మారింది. ఆమె గొప్పదనం తెలిసి స్థానికులు అనేక మంది జేజేలు పలుకుతున్నారు.

Viral: దేవత అంటే ఈమెనే! లాటరీలో గెలిచిన రూ.121 కోట్లతో..

ఇంటర్నెట్ డెస్క్: ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరుకునే వారు కోకొల్లలుగా ఉన్న లోకం ఇది. కోట్ల కొద్దీ పోగేసుకుంటారు తప్పితే కష్టాల్లో ఉన్న వాడికి పైసా కూడా ఇచ్చేందుకు ఒప్పుకోరు. కానీ, మానవత్వానికి ప్రతీకగా నిలిచే కొందరు తమ సంపదను ఇతరులతో పంచుకునేందుకు ఏ మాత్రం సంశయించరు. ఇలాంటి వారు ఉండేది కొందరే అయినా వారిని చూడగానే మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తుంది. ప్రస్తుతం ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళపై జనాలు ఇవే ప్రశంసలు కురిపిస్తున్నారు. లాటరీలో చేతికొచ్చిన కోట్ల రూపాయల సొమ్మును ఆమె ప్రజాసేవ కోసం వినియోగించడమే ఇందుకు కారణం (Viral).

Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!


ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఫ్రాంకాయిస్ కానలీ అనే 58 ఏళ్ల మహిళకు ఇటీవల ఊహించని అదృష్టం వరించింది. లాటరీలో ఆమె ఏకంగా బంపర్ ఆఫర్ గెలుచుకున్నారు. సాధారణంగా ఇంత పెద్ద మొత్నాన్ని గెలుచుకున్నాక విజేతల ఆనందానికి అంతేలేకుండా పోతుంది. ఆ డబ్బుతో ఏం చేయాలనే దానిపై రకరకాల ప్రణాళికలు వేస్తుంటారు. అప్పులు తీర్చాలని, ఓ ఇల్లు సమకూర్చుకోవాలని, లేదా విహార యాత్రలకు వెళ్లాలని ఆశిస్తుంటారు.

Viral: డాక్టర్ దారుణం! 13 ఏళ్ల కూతురితో పేషెంట్‌కు మెదడు ఆపరేషన్! ఇప్పుడేమో..

కానీ ఫ్రాంకాయిస్ కానలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. అప్పటికే ఆమె స్థితి మంతురాలు. భర్త స్థానికంగా మంచి పేరున్న వ్యాపారి. డబ్బులకు లోటు లేకపోయినా లాటరీ డబ్బును తన కోసమే ఆమె ఖర్చు చేసుకోవచ్చు. ఎవరూ ఆమెను ప్రశ్నించరు. కానీ కానలీ మాత్రం ఉదాత్తంగా ఆలోచించింది. తన లాటరీ డబ్బుతో నచ్చిన చెప్పులు కొనుక్కున్న ఆమె మిగతా డబ్బుతో రెండు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి స్థానికంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించింది. ఇప్పటివరకూ ఆమె వివిధ సేవ కార్యక్రమాలపై 60 మిలియన్ పౌండ్ల వరకూ ఖర్చు పెట్టింది.


Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు

సేవా కార్యక్రమాలపై మక్కువ ఎందుకు కలిగిందని స్థానిక మీడియా కానలీని ప్రశ్నించింది. లాటరీ గెలిచినందుకు పెద్ద పార్టీ ఇవ్వడంపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని, ఈ డబ్బుతో బీదసాదలకు సేవల చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చింది. కష్టాల్లో ఉన్న వారికి కాస్త సాంత్వన కలిగించడంలో తనకు ఆనందం ఉన్నదని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, కానలీ సాయం పొందిన ఎందరో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె తమకు దైవసమానమంటూ ధన్యవాదాలు చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Nov 18 , 2024 | 10:51 PM