Viral: స్త్రీత్వం కోల్పోయావని మహిళపై దారుణ ట్రోలింగ్.. జిమ్లో కండలు పెంచిందని..
ABN , Publish Date - May 18 , 2024 | 04:12 PM
జిమ్లో చేరి మంచి దేహదారుఢ్యం సంపాదించిన ఓ యువతి తన ఫొటోలను నెట్టింట పంచుకున్నందుకు జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న యువతి.. ట్రోలర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: జిమ్లో చేరి మంచి దేహదారుఢ్యం సంపాదించిన ఓ యువతి తన ఫొటోలను నెట్టింట పంచుకున్నందుకు జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న యువతి.. ట్రోలర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది (Viral).
ఢిల్లీకి చెందిన ఆంచల్ ఫిట్ నెస్ కోచ్ గా చేస్తున్నారు. కొంతకాలం ఆమె జిమ్ ఛాతికి సంబంధించిన కసరత్తులు చేసి దేహదారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు. పూర్తిగా మారిపోయిన ఆమె తన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. జనాలు తనను మరింతగా ప్రోత్సహిస్తారని భావించారు. కానీ సీన్ ఊహించని విధంగా రివర్స్ అయ్యింది. జనాలు ఆమెను బీభత్సంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. పలువురు ఆమెను బాడీ షేమింగ్ చేశారు. స్త్రీత్వం పోగొట్టుకున్నావంటూ ఇష్టారీతిన ట్రోల్ చేయడం ప్రారంభించారు (Woman Body Shamed For Muscular Photo Responds To Trolls).
Viral: గర్ల్ఫ్రెండ్కు పెళ్లి ప్రపోజల్.. ఐస్క్రీమ్లో ఉంగరం దాచి తినమని ఇస్తే..
ఇదంతా చూసిన ఆంచల్ ట్రోలర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ‘‘ఇటీవల ఊహించని స్థాయిలో నాపై ద్వేషం వెళ్లగక్కారు. కానీ నేను కించెం కూడా హర్ట్ కాలేదు. వాస్తవానికి ఆ ట్వీట్ లో నేను పంచుకున్న ఇతర విషయాలపై జనాలు దృష్టి పెట్టకపోవడం నన్ను ఒకింత నిరాశ పరిచింది. ఇక ఫొటో గురించి మాట్లాడుకుంటే.. పాత ఫొటో గతేడాది తీసింది. అప్పట్లో నేను ఆరేడు కిలోలు అధికంగా బరువు ఉన్నా. కానీ మహిళ దేహదారుఢ్యం చూసి ఇంత మంది ఇగో హర్ట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని ఆమె ట్వీట్ చేసింది. తనను ట్రోల్ చేసిన మహిళలను కూడా ఆమె చెడుగుడు ఆడుకుంది.
ఇక నెట్టింట అనేక మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘‘వారు నీలాగా ఎప్పటికీ కాలేరు కాబట్టే నిన్ను చూసి ఈర్ష్య పడుతున్నారు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.