Viral: ఈమె ఇలా తయ్యారయ్యిందేంటి! చివరకు యోగాను కూడా అవమానించిందిగా..
ABN , Publish Date - Aug 31 , 2024 | 08:31 AM
పాముతో యోగా చేస్తూ ఓ మహిళ విమర్శల పాలైంది. పాము ఇబ్బందికి గురయ్యేలా దాన్ని చేతిలో పట్టుకుని యోగా చేయడం చూసి జనాలు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రోజూ యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. పాశ్చాత్యదేశాల్లో నిత్యం యోగా చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక భారతీయులు కూడా యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు మాత్రం కాస్త డిఫరెంట్. వ్యూస్ తెచ్చుకోవాలనే తాపత్రయంలో ఎలాంటి పనిచేసేందుకైనా వెనకాడరు. ఇది నిజమని రుజువు చేస్తూ ఓ యువతి చేసిన పనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Viral).
Viral: కారులో డాష్‌క్యామ్ పెట్టుకోండి.. ఇలాంటి మహిళ ఎదురైతే యమా డేంజర్
జాంగ్ అనే యువతి పాముతో యోగా చేస్తూ ఓ వీడియో అప్‌లోడ్ చేసింది. కాలిఫోర్నియాలో ఉండే ఆమె ఇలా యోగా పేరిట పామును టార్చర్ పెట్టేందుకు ఏమాత్రం వెనకాడలేదు. అంతేకాకుండా, తానేదో గొప్పపని చేసినట్టు వీడియోలో తెగ బిల్డప్ ఇచ్చుకుంది. దాదాపు గంట పాటు పాముతో యోగా చేసినట్టు వీడియో పోస్టు చేసింది (Woman does yoga with snakes in California studio slammed).
‘ఈ ఒక్క చోటే మీరు పాముతో యోగా చేయగలరు. గంట పాటు సాగే సెషన్‌లో ఒక్కొక్కరికీ ఒక పాము ఇస్తారు. పాముతో యోగా చేయడాన్ని మీ రొటీన్‌లో భాగం చేసుకోవాలి. ఇవన్నీ వినగానే నేను షాకయ్యా. కానీ వెంటనే స్లాట్ బుక్ చేసుకున్నా. మీరు అక్కడికి వెళ్లగానే యోగా గురువు మీకో పామును ఇస్తారు. పామును ఎలా పట్టుకోవాలనే విషయంలో స్నేక్ హాండ్లర్ కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఇవన్నీ విషం లేని బాల్ పైథాన్ పాములే’’ అని ఆయన చెప్పుకొచ్చింది.
‘‘తొలుత నేను చాలా భయపడ్డాను కానీ ఆ తరువాత యోగాపై దృష్టి పెట్టగలిగాను. భయాన్ని కాస్త పక్కన పెట్టి చేస్తున్న పనిపై దృష్టిపెట్టాను. దీంతో, కాస్త భయపడ్డాను. ఆ తరువాత మెల్లగా అలవాటు పడిపోయాను. ఈ పాములు కూడా బరువు తక్కువగా, సుతిమెత్తగా ఉంటాయి’’ అని తెలిపింది.
తానేదో ఘన కార్యం చేసినట్టు ఆమె చెప్పడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ‘‘ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడమే. అవి మీ ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉన్న ఆట వస్తువులు కాదు. సనాతన సంప్రదాయాన్ని ఇలా అవమానించే బదులు ఒక్కసారి దాని చరిత్ర తెలుసుకుని గౌరవంతో మసులు కోవాలి’’ అని ఓ వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంతువులతో యోగాను తాను అస్సలు సమర్థించనని మరో వ్యక్తి అన్నారు. మూగజీవాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా అనవసర రిస్క్ తీసుకున్నట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.