Share News

Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:53 PM

ప్రసవం సమయంలో వైద్యులు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ 18 ఏళ్లుగా నరకం అనుభవిస్తోంది. తన సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలీక అలమటిస్తోంది.

Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం

ఇంటర్నెట్ డెస్క్: ప్రసవం సమయంలో వైద్యులు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ 18 ఏళ్లుగా నరకం అనుభవిస్తోంది. తన సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలీక అలమటిస్తోంది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ ఉదంతం థాయ్‌లాండ్‌లో వెలుగు చూసింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన

నారాథివాట్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ (36) ప్రైవేటు పార్ట్‌లో వైద్యులు ఓ సూదిని జారవిడిచి అలాగే కుట్లు వేసి ఇంటికి పంపించారు. ఆమెకు 18 ఏళ్ల వయసు డెలివరీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నాళ్లుగా తాను నరకం అనుభవిస్తూనే ఉన్నానని ఆమె వాపోయింది. జరిగిన పొరపాటును గుర్తించిన వెంటనే వైద్యులు సూదిని తీసేందుకు ప్రయత్నించినా కుదర్లేదని చెప్పింది. తొలుత డాక్టర్ చేతి వేళ్లతో దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించాడని, కానీ రక్తస్రావం ఎక్కువ కావడంతో కుట్లు వేసి ఆపరేషన్ పూర్తి చేశారని చెప్పింది. నాటి నుంచి తనకు పొత్తి కడుపులో నిత్యం నొప్పి వేధిస్తోందని తెలిపింది. ఇటీవల ఓసారి ఎక్స్ రే తీయించుకోగా సూది ఇంకా లోపలే ఉన్న విషయం వెలుగులోకి వచ్చినట్టు చెప్పింది.


ఆన్‌లైన్ డేటింగా? జాగ్రత్త.. ఇలాంటోళ్లు తారసపడితే కొంప కొల్లేరే!

శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించినా ఆపరేషన్ వాయిదా పడుతూ వస్తోందని ఆమె వాపోయింది. సూది శరీరంలో సూది కదలి మరోచోటకు చేరడంతో వైద్యులు ఇప్పటికి మూడుసార్లు ఆపరేషన్ వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పింది. ఇన్ని సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగినందుకు తనకు డబ్బు, సమయం వృథా అయ్యి మానసిక వేదన మిగిలిందని వాపోయింది.

Viral: తాత పుట్టిన రోజున ఒంటరిగా బామ్మ.. మనవడి ఊహించని సర్‌ప్రైజ్!


వైద్యులు చెప్పే దాని ప్రకారం, శస్త్రచికిత్స సందర్భంగా పొరపాటున శరీరంలోనే మిగిలిపోయే వివిధ వస్తువుల కారణంగా ఇన్ఫెక్షన్లు, నొప్పి, పుళ్లు పడటం, అంతర్గత రక్తస్రావం, అవయవాలు పాడవడం చివరకు కొన్ని సందర్భాల్లో మరణం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు రోగుల శరీరాల్లో స్పాంజ్, టవల్స్, క్లాంప్స్, స్కాల్పెల్స్, కాటన్ స్వాబ్స్, నీడిల్స్, గాజ్ ప్యాడ్స్ వంటివి పొరాపాటున వదిలేస్తుంటారట. వారంలో కనీసం 39 సార్లు ఇలా జరుగుతుంటుందని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.

Viral: ఈ స్లిప్పర్స్ చలికాలం కోసమట.. ఏం క్రియేటివిటీరా బాబూ..

Read Latest and Viral News

Updated Date - Nov 12 , 2024 | 05:01 PM