Viral: సోషల్ మీడియాకు బానిసైన వివాహిత ఎలాంటి పని చేసిందో తెలిస్తే..
ABN , Publish Date - May 27 , 2024 | 07:22 PM
సోషల్ మీడియానే లోకంగా బతికేస్తున్న ఓ వివాహిత చివరకు ఊహించని పని చేసింది. రీల్స్ షార్ట్ వీడియోలు చేయొద్దని భర్త కట్టడి చేయడంతో చివరకు కూతురిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. బీహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా.. ఇది రెండు వైపులా పదునున్న కత్తి. కొందరు సోషల్ మీడియాతో తమ జీవితాల్ని బాగు చేసుకున్నారు. దీన్ని ఆదాయవనరుగా మార్చుకుని కష్టాల నుంచి గట్టెక్కారు. కొందరు ఏకంగా లక్షాధికారులై సెలబ్రిటీలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు మాత్రం ఈ ట్రెండ్‌కు బానిసలుగా మారిపోయారు. లైకులు కామెంట్లే లోకంగా బతికేస్తున్నారు. అవి లేకపోతే క్షణకాలం కూడా బతకలేనట్టు వ్యసనపరులుగా మారిపోయారు. చివరకు కాపురాలను కూడా కూల్చుకుంటున్నారు. ఇలాంటి ఓ మహిళ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది (Viral).
Viral: వామ్మో.. అపరకుబేరులు! వీళ్ల బాత్‌రూంలో ఏముందో చూస్తే..
బీహార్‌కు చెందిన జితేంద్ర, తమన్నా పర్వీన్‌లది ప్రేమ వివాహం. 2017లో ఓ కోచింగ్ సెంటర్లో వారి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు వివాహ బంధంలో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత తమన్నా తన పేరును సీమగా మార్చుకుంది. ఈ క్రమంలో వారికి ఓ పాప కూడా జన్మించింది. అయితే, కొంతకాలం క్రితం సీమా షార్ట్స్ వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఇటీవల కాలంలో ఆమెకు పాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇన్ స్టా గ్రామ్‌లో పది వేల మంది, ఫేస్‌బుక్‌లో మరో 6 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు (Woman flees home after husband stops her from making Instagram reels).
ఈ క్రమంలో సీమాకు సోషల్ మీడియానే ప్రపంచంగా మారిపోయింది. లైకులు, కామెంట్స్, షేర్లే లోకంగా బతకడం ప్రారంభించింది. నిత్యం ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగితేలేది. భార్య తీరు నచ్చక భర్త అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పే వాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా తరచూ వివాదం తలెత్తేది. అయితే, భర్త తీరు భరించలేకపోయిన ఆమె ఇటీవల ఓ రోజు అతడికి చెప్పకుండా కూతురిని తీసుకుని వెళ్లిపోయింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన భర్త జరిగింది గుర్తించి లబోదిబోమన్నాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.