Viral Video: వావ్.. సూపర్ టెక్నిక్.. ఉడికించిన బంగళాదుంపల తొక్కలను ఎంత సింపుల్గా తీసిందో చూడండి..
ABN , Publish Date - Oct 05 , 2024 | 09:55 PM
బంగాళాదుంపలతో వంటలు చేసేటపుడు వాటిని ఉడికించి తొక్క తీయడం కాస్త కష్టమైన పని. బంగాళదుంపలు వేడిగా ఉంటే, బంగాళాదుంపల తొక్క తీయడానికి సమయం పడుతుంది. ఈ కష్టమైన పనికి ఓ మహిళ సులభమైన పరిష్కారం కనుగొంది.
మనదేశంలో చాలా మంది బంగాళాదుంప (Potato) లేకుండా వంట చేయలేరు. కూర మాత్రమే కాదు.. పూరీ, చపాతీ, సమోసా.. ఇలా ఏది తిన్నా బంగాళాదుంపతో చేసిన కూర ఉండాల్సిందే. బంగాళాదుంపలతో వంటలు చేసేటపుడు వాటిని ఉడికించి తొక్క తీయడం కాస్త కష్టమైన పని. బంగాళదుంపలు వేడిగా ఉంటే, బంగాళాదుంపల తొక్క తీయడానికి సమయం పడుతుంది (Peel boiled potatoes). ఈ కష్టమైన పనికి ఓ మహిళ సులభమైన పరిష్కారం కనుగొంది. తన టెక్నిక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
aroob_jatoi అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ బంగాళాదుంపలను ఉడికించింది. ఒక్కో బంగాళాదుంప తొక్కతీయడం కాకుండా పూరీలను వేయించే గరిటెతో సులభంగా పని కానిచ్చేసింది. ఆ గరిటెను వెనక్కి తిప్పి దానిపై ఓ ఉడికించిన బంగాళాదుంపను వేసి చేతులతో గట్టిగా నొక్కింది. దీంతో తొక్క ఆ గరిటెపై ఉండిపోయి బంగాళాదుంప గిన్నెలో పడుతోంది. అలా మొత్తం బంగాళాదుంపల తొక్కలను సులభంగా తీసేసింది. ఈ షార్ట్కట్ పద్ధతి చాలా మంది మహిళలకు నచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 4.6 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ షార్ట్కట్ పద్ధతి బాగుంది``, ``ఇది నిజంగా పని చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటా``, ``ఇది నిజంగా మంచి ఆలోచన``, ``ఆమె హౌస్ వైఫ్ కాదు.. ఆలూ ఇంజినీర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?, వధువుకు ఎలా వెల్కమ్ చెప్పాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.