Share News

Viral: స్కూల్లో జరిగేదేంటో తెలుసుకునేందుకు కూతురి ఆటబొమ్మలో సీక్రెట్ కెమెరా

ABN , Publish Date - Nov 07 , 2024 | 06:28 PM

తన కూతురు చదివే ప్రీ స్కూల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ బ్రిటన్ మహిళ చిన్నారి ఆటబొమ్మలో రహస్య కెమెరా పెట్టింది. ఆ తరువాత ఏం జరిగిందీ చెబుతూ నెట్టింట ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Viral: స్కూల్లో జరిగేదేంటో తెలుసుకునేందుకు కూతురి ఆటబొమ్మలో సీక్రెట్ కెమెరా

ఇంటర్నెట్ డెస్క్: తన కూతురు చదివే ప్రీ స్కూల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ బ్రిటన్ మహిళ చిన్నారి ఆటబొమ్మలో రహస్య కెమెరా పెట్టింది. మొత్తం 8 గంటల పాటు స్కూల్లో జరిగిందంతా కెమెరాలో రికార్డైంది. ఇందులో మూడు గంటల ఫుటేజీ చూసిన ఆమె ఇకపై తన కూతురిని ఆ స్కూలుకు పంపించేది లేదని నిర్ణయించుకుంది. తనకెదురైన అనుభవాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది (Viral).

USA: షాకింగ్.. గర్ల్‌ఫ్రెండ్ హెయిర్ స్టైల్ నచ్చక కత్తితో పొడిచి హత్య!

ఉద్యోగం కొనసాగించేందుకు తాను తన బిడ్డను నర్సరీ స్కూల్లో చేర్పించినట్టు మహిళ చెప్పుకొచ్చింది. తన బిడ్డకు అప్పటికి 15 నెలల వయసే ఉంటుందని పేర్కొంది. ఒక రోజు తాను ఆఫీసు నుంచి తిరిగొస్తూ చిన్నారిని కోసం నర్సరీకి వెళితే బిడ్డ ఏడుస్తూ కనిపించేసరికి తన గుండె తరుక్కుపోయిందని చెప్పింది. ఏం జరిగిందని అక్కడి ఆయాను ప్రశ్నిస్తే చిన్నారి అప్పటివరకూ బాగానే ఆడుకుందని, సడెన్‌గా ఏవడం మొదలెట్టిందని ఆమె చెప్పిందని మహిళ చెప్పుకొచ్చింది.


అయితే, కరోనా తరువాత స్కూళ్ల రూల్స్ అన్ని మారిపోయాయని, తల్లిదండ్రులను స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలుండే గదుల్లోకి అనుమతించట్లేదని బ్రిటన్ మహిళ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, కిటికీలకు నల్లని టింట్, కర్టెన్స్ ఉండటంతో లోపల ఏం జరుగుతోందో బయట నుంచి చూసే అవకాశం లేకపోయిందని వివరించింది. దీంతో, తాను స్కూల్లో రోజంతా ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఆటబొమ్మలో రహస్య కెమెరా అమర్చి చిన్నారికి ఇచ్చి స్కూల్లో దిగబెట్టినట్టు చెప్పింది.

Viral: పులితో ఇలాంటి పరాచకం ఎక్కడా చూసుండరు! ఇతడికి ఏదోక రోజు మూడటం పక్కా!


ఆ రోజు కెమెరాలో 8 గంటల ఫుటేజీ రికార్డైందని, సాయంత్రం తాను ఇంటికొచ్చాక అందులోని సుమారు 3 గంటల ఫుటేజీని తాను చూసినట్టు చెప్పింది. అందులోని వివరాలు తాను నెట్టింట వెల్లడించదలుచుకోలేదని చెప్పింది. అయితే, స్కూలు యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్టు ఏమీ కనబడకపోయినప్పటికీ పిల్లలతో వారు వ్యవహరించిన తీరు మాత్రం తనకు అస్సలు నచ్చలేదని చెప్పింది. ఇకపై తన బిడ్డను ఆ నర్సరీకి తీసుకెళ్లే ప్రశ్నేలేదని స్పష్టం చేసింది.

ఇక తన చేసింది చట్టబద్ధమైందో కాదో కూడా తనకు తెలీదని మహిళ చెప్పింది. స్కూలు యాజమాన్యానికి తెలీకుండా అమర్చిన రహస్య కెమెరాలోని ఫుటేజీ కోర్టులో చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నించింది. దీని ఆధారంగా అధికారులకు ఫిర్యాదు చేయొచ్చా అని సందేహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ ఉదంతంపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

Viral: వామ్మో.. కాకుల్లో ఇంతటి పగాప్రతీకారాలా? ఏకంగా 17 ఏళ్ల పాటు..

Read Latest and Health News

Updated Date - Nov 07 , 2024 | 06:42 PM