Viral: వరుడు కావాలంటూ మెడలో బోర్డు వేలాడేసుకుని హోటల్ ముందు నిలబడ్డ యువతి!
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:33 PM
పెళ్లి చేసుకునే వారు సాధారణంగా తమ ప్రొఫైల్‌ను మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పెడతారు. లేదంటే వాటిని తెలిసిన వాళ్లకు ఫార్వర్డ్ చేస్తారు. కానీ ఓ యువతి ఇందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకునే వారు సాధారణంగా తమ ప్రొఫైల్‌ను మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పెడతారు. లేదంటే వాటిని తెలిసిన వాళ్లకు ఫార్వర్డ్ చేస్తారు. కానీ ఓ యువతి ఇందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు కావాలంటూ ఓ యువతి ఏకంగా వీధిలోకి వచ్చేసింది. తన బయోడేటా వివరాలు రాసుకున్న ఓ బోర్డును మెడలో తగిలించుకుని ఓ హోటల్ ముందు నిలబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: తల్లి ఆనందం కోసం పోలీసు అవతారమెత్తిన నిరుద్యోగ యువతి! చివరకు..
సయాలీ సావంత్ అనే 29 ఏళ్ల ముంబై యువతి ఇలా వినూత్న పోకడకు పూనుకుంది. పెళ్లి బయోడేటా అని రాసున్న బోర్డును మెడలో వేసుకుని తాజ్ హోటల్ ముందు నిలబడింది. తన పొడవు, ఇతర వ్యక్తిగత వివరాలను బోర్డు మీద రాసుంది. ఓ యువతి ఇలా నిలబడంతో రోడ్డుపై వచ్చే పోయే వాళ్లు ఆశ్చర్యపోయారు. వరుడు రెడీగానే ఉన్నాడంటూ కొందరు సెటైర్లు కూడా పేల్చారు. కొందరు మహిళలు ఆమెను చూసి పడీపడీ నవ్వుకున్నారు. కొందరు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అయితే, ఆమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అని తెలిశాక మరింతగా ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియా జనాల్ని ఆకట్టుకునేందుకు సయాలీ గతంలోనూ కూడా ఇలాంటి చిలిపి పనులు చేసింది. ఈసారి మరింత కొత్తగా జనాల్ని ఆకర్షించాలనుకున్న ఆమె ఇలా బహిరంగ పెళ్లి ప్రస్తావనతో హల్‌చల్ చేసింది. నాశిక్‌లో నివసించే సయాలీ ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
Viral: ఆఫీసులో కునుకు తీసినందుకు ఊస్టింగ్.. బాధితుడికి రూ.41.6 లక్షల పరిహారం!
ఇదిలా ఉంటే, ఇటీవల ఓ మహిళ పార్లీజీ బిస్కెట్స్ వేసిన బిర్యానీని వడ్డిస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. వీడియోలోని మహిళ బిస్కెట్లు ఉన్న బిర్యానీని వడ్డించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె విద్యార్థులు కూడా ఈ కొత్త బిర్యానీ టెస్టు చూసి ఆశ్చర్యపోయారు. బిర్యానీలో తాను బిస్కెట్ పొడి కూడా కలుపుతానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, బిర్యానీ అభిమానులు మాత్రం ఈ వీడియోపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ప్రయోగాలు మానుకోవాలని మండిపడ్డారు. బిర్యానీకి ఓ ప్రత్యేకత ఉందని, దాన్ని గౌరవించాలని హితవు పలికారు. ప్రయోగాల పేరిట హద్దులు దాటొద్దని అన్నారు.
Viral: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య వింత రివెంజ్.. షాకింగ్ వీడియో!
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..