Share News

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:20 PM

అప్పటికే పెళ్లైన వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకునేందుకు అతడి భార్యను విడాకులు ఇవ్వమని కోరింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.1.39 కోట్లు కూడా చెల్లించింది. తాజాగా ఆ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ సదరు మహిళపై కోర్టుకెక్కింది.

Viral: మరో మహిళ భర్త కోసం రూ.1.39 కోట్లు చెల్లించి.. చివరకు రిఫండ్ కోసం పట్టు

ఇంటర్నెట్ డెస్క్: అప్పటికే పెళ్లైన వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకునేందుకు అతడి భార్యను విడాకులు ఇవ్వమని కోరింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.1.39 కోట్లు కూడా చెల్లించింది. తాజాగా ఆ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ సదరు మహిళపై కోర్టుకెక్కింది. చైనాలో వెలుగు చూసిన ఈ వింత ఉదంతం ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది (Viral).

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!


పూర్తి వివరాల్లోకి వెళితే, హాన్ అనే వ్యక్తికి 2013లో యాంగ్ అనే మహిళతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పెళ్లి అయ్యినప్పటికీ అతడు మరో మహిళ షీకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో షీ 2022లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తమ బంధం ఎలాగైన శాశ్వతం చేసుకోవాలనుకున్న షీ యాంగ్‌ను సంప్రదించింది. హాన్‌కు విడాకులిస్తే పరిహారంగా 2 మిలియన్ యువాన్‌లను ఇస్తానని హామీ ఇచ్చింది. యాంగ్ కూడా అంగీకరించడంతో షీ ఆ మేరకు డబ్బులు కూడా చెల్లించింది. ఈ ఒప్పందం ప్రకారం, 2022 ముగిసేసరికి యాంగ్ తన భర్త హాన్‌కు విడాకులిచ్చేయాలి. సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

Viral: కోటీశ్వరుడిగా మారడంపై ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందన ఏంటంటే..

మాట ప్రకారం, షీ యాంగ్‌కు డబ్బు చెల్లించినా ఆమె మాత్రం తన భర్త హాన్‌కు విడాకులివ్వనేలేదు. కాలం గడుస్తున్నా యాంగ్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో షీ చివరకు కోర్టును ఆశ్రయించింది. తాను చెల్లించిన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసింది. డైవర్స్ కోసం తమ మధ్య మౌఖిక ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చింది.


అయితే, న్యాయస్థానం మాత్రం షీ అభ్యర్థనను తోసి పుచ్చింది. మహిళల మధ్య జరిగిన మౌఖిక ఒప్పందం నైతికవిలువలు, పబ్లిక్ ఆర్డర్‌కు వ్యతిరేకమని పేర్కొంది. ఓ చట్టబద్ధమైన బంధాన్ని తెగదెంపులు చేసేందుకు ఉద్దేశించిన నగదు బదిలీ జరిగిందని అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, వారి బంధానికి చట్టపరమైన ప్రాముఖ్యత కూడా లేదని స్పష్టం చేసింది. హాన్, యాంగ్ అంతకుమునుపే డైవర్స్ తీసుకున్నారని, విడాకులు మంజూరు చేసేందుకు కూలింగ్ పీరియడ్ ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రస్తుతం హాన్, యాంగ్ కూలింగ్ పీరియడ్‌లో ఉన్నందున యాంగ్‌తో జరిగిన ఒప్పందం చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో షీ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Viral: అందంగా ఉన్నందుకు పార్టీకి రావద్దంటూ నిషేధం! మహిళకు షాకింగ్ అనుభవం

Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..

Read Latest and Viral News

Updated Date - Dec 16 , 2024 | 04:37 PM