Viral Video: రూ.4.5 లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్స్ కొంటే.. ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - Jan 06 , 2024 | 04:18 PM
శ్రేయత్ గార్గ్ . ఇటీవల భర్త, పిల్లలతో కలిసి టొరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. నలుగురి టికెట్ల కోసం రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు. విమానంలో సౌకర్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: జర్నీ కోసం లక్షలు లక్షలు ఖర్చు చేస్తుంటారు కొందరు. అలాంటి కోవకు చెందుతారు శ్రేయత్ గార్గ్ (Shreyti Garg). ఇటీవల భర్త, పిల్లలతో కలిసి టొరంటోకు ఎయిర్ ఇండియా (Air India) విమానంలో వెళ్లారు. నలుగురి టికెట్ల కోసం రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు. ఆ విమానంలో సరైన సదుపాయాలు లేవు. జర్నీలో జరిగిన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో (Social Media) షేర్ చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఫారిన్ జర్నీ అయినందున చాలా సమయం ఉంటుంది కదా అని పాటలు ఆన్ చేసేందుకు ట్రై చేసింది. ఎంటర్‌టైన్‌మెన్ మెంట్ సిస్టమ్ ఆన్ కాలేదు. దీంతో చిరాకు మొదలైంది. సీటు పైన లైట్ కూడా పనిచేయలేదు. దీంతో అసహనాన్ని తట్టుకోలేక పోయింది. తన పిల్లాడు పుస్తకం చూడగా పైన లైట్ లేదు. చివరికి మొబైల్ టార్చ్ ఆన్ చేయాల్సి వచ్చింది. తమకు ఇచ్చిన సీటులో ఓ హ్యాండిల్ విరిగిందని చెప్పింది. అందుల్లోంచి వైర్లు బయటకు వచ్చాయని, వాటితో పిల్లలకు ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేసింది.
తమకు జరిగిన ‘అసౌకర్యం గురించి విమాన సిబ్బంది దృష్టికి గార్గ్ (Garg) తీసుకొచ్చారు. ఏ మాత్రం ఫలితం లేదు. వారు వచ్చి సరి చేసే ప్రయత్నం చేశారు. ఎంటర్‌టైన్ మెంట్ సిస్టమ్ మాత్రం ఆన్ కాలేదు. ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు వస్తాయి.. మిగతా విమాన సంస్థల కన్నా ఎక్కువగా తీసుకుంటారు. సౌకర్యాలు మాత్రం కల్పించరు.. ముఖ్యంగా పిల్లలతో జర్నీ చేసేవారికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది’ అని గార్గ్ ఇన్ స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేయొద్దని సూచిస్తున్నారు.