Share News

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:05 PM

బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసిన ఓ మహిళ అదంతా తనకే చెందాలనే దురాశతో అతడిని హత్య చేసింది. అదంతా ఉత్తిదేదని చివరకు తెలిసి బావురుమంది.

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసిన ఓ మహిళ అదంతా తనకే చెందాలనే దురాశతో అతడిని హత్య చేసింది. అదంతా ఉత్తిదేదని చివరకు తెలిసి బావురుమంది. నిందితురాలు చేసిన నేరం కూడా బట్టబయలు కావడంతో న్యాయస్థానం తాజాగా ఆమెకు 25 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అమెరికాలో సంచలనంగా (Viral) మారిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: ఎడారిలో చిక్కుకుపోయిన యువతులకు వింత అనుభవం! ఉబెర్ యాప్‌లో ఒంటెల సవారీ!


నార్త్‌ డకోటాకు చెందిన థియా కినోయెర్‌ (48), కొన్నేళ్లుగా స్టీవ్ ఎడ్వర్డ్ రైలీ (51)తో కలిసి ఉంటోంది. కొంతకాలం క్రితం రైలీకి ఓ ఈ-మెయిల్ వచ్చింది. అతడికి త్వరలో 30 మిలియన్ డాలర్ల ఆస్తి వారసత్వంగా రానుందనేది దాని సారాంశం. ఇది థియా కంటపడటంతో ఆమెకు దుర్బుద్ధి మొదలైంది. బాయ్‌ఫ్రెండ్ ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకునేందుకు అతడిని అడ్డుతొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఓ రోజు అతడు తాగే టీలో ప్రాణాంతకమైన ఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిపి అతడికి ఇచ్చింది. గర్ల్‌ ఫ్రెండ్ కుట్ర గురించి అసలేమాత్రం తెలియని రైలీ ఆ టీని తాగిన మరుసటి రోజే అనారోగ్యం పాలయ్యాడు. ఆ తరువాత కన్నుమూశాడు. ఎండదెబ్బ కొట్టడంతో రైలీ మరణించాడని థియా పోలీసులకు తెలిపింది. కానీ, పోస్టుమార్టంలో మాత్రం ఇథిలీన్ డయాక్సైడ్ కారణంగా అతడు మరణించినట్టు తేలింది.

UP: భర్త ఆయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. రాత్రికి విషం పెట్టి హత్య!


ఇదిలా ఉంటే, తన బాయ్‌ఫ్రెండ్‌కు థియా విషమిచ్చి చంపేస్తానంటూ తమతో జోక్ చేసిందని ఆమె స్నేహితులు చెప్పారు. దీంతో, పోలీసులకు అనుమానం బలపడి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, రైలీకి అందిన ఈమెయిల్ కూడా ఫేక్ అని తేలడంతో థియాకు దిమ్మతిరిగినంత పనైంది. ఈ క్రమంలో ఆమె తను నేరం చేసినట్టు అంగీకరించడంతో న్యాయస్థానం నిందితురాలికి అక్టోబర్ 16న 25 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. తొలుత ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ నిందితురాలు స్వయంగా నేరం అంగీకరించడంతో ఈ మేరకు శిక్ష పడింది.

Viral: షాకింగ్! కోడి గుడ్డు కనబడగానే ఈ పాము ఎలా రెచ్చిపోయిందో చూడండి..


కాగా, థియా ఒడిగట్టిన దారుణంతో రైలీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమెకు పడిన శిక్ష చాలా స్వల్పమైనదని రైలీ సోదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన పనికి ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయిందని రైలీ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. థియా దురాశ తమ జీవితాన్ని తలకిందులు చేసిందని, తండ్రిలేని లోటుతో తనకు నరకం కనిపిస్తోందని రైలీ కొడుకు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Latest and Viral News

Updated Date - Oct 22 , 2024 | 03:10 PM