Share News

Viral: త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ పేపర్లో యాడ్!

ABN , Publish Date - Nov 25 , 2024 | 09:50 PM

పురుషాధిక్య సమాజం తీరుతెన్నులను ఎండగడుతూ పేపర్లో వచ్చిన ఓ మాట్రిమోనియల్ యాడ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ ఇచ్చిన ఈ యాడ్ జనాలు షాకయ్యేలా చేస్తోంది.

Viral: త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ పేపర్లో యాడ్!

ఇంటర్నెట్ డెస్క్: పెద్దలు కుదిర్చే పెళ్లంటే సవాలక్ష అంశాలు చూస్తుంటారు. ముఖ్యంగా యువతుల విషయంలో వరుడి తరపు వారు వంకలు ఎక్కువ పెడుతుంటారు. వధువు ఇలా ఉండాలి, వంట రావాలి, రంగు ఉండాలి అంటూ ఎన్నెన్నో చెప్పుకొస్తుంటారు. పురుషాధిక్య సమాజానికి ప్రతిబింబంగా నిలిచే ఈ తీరును ఎండగడుతూ పేపర్లో ఇచ్చిన ఓ యాడ్ వైరల్‌గా (Viral) మారింది.

Viral: వరుడు కావాలంటూ మెడలో బోర్డు వేలాడేసుకుని హోటల్ ముందు నిలబడ్డ యువతి!


యాడ్‌లో కనిపించిన దాని ప్రకారం, స్త్రీవాద భావజాలం ఎక్కువగా ఉన్న ఓ యువతికి తగిన వరుడు కావాలంటూ ఈ యాడ్ ఇచ్చారు. ఈ ప్రకటన ప్రకారం, యువతికి 30 ఏళ్లు. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అస్సలు పడదు. సామాజిక సంస్థలో పనిచేస్తుంటుంది. ముక్కూ, చెవులకు రకరకాల పుడకలు పెట్టుకుని ఉంటుంది. ఆమె జుట్టు కూడా పొట్టిగానే ఉంటుంది. ఈ వధువుకు 25 నుంచి 28 ఏళ్ల వయసు మధ్య ఉన్న వరుడు కావాలి. అతడు తన తల్లిదండ్రులకు ఒకే సంతానం అయి ఉండాలి. అతడికి వ్యాపారం ఉండాలి. లాభాల్లో నడుస్తుండాలి, భారీ బంగ్లా, 20 ఎకరాల ఫామ్ హౌస్ ఉండాలి. అతడికి కచ్చితంగా వంట వచ్చి ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న వారు తమని సంప్రదించాలంటూ ప్రకటనకర్తలు ఓ ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.

Viral: తల్లి ఆనందం కోసం పోలీసు అవతారమెత్తిన నిరుద్యోగ యువతి! చివరకు..


ఇదంతా చదివిన నెటిజన్లలో కొందరు ఆశ్చర్యపోతే కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమానత్వం కోరుకునే స్త్రీవాది తనకు కాబోయే వాడి విషయంలో మాత్రం ఇలాంటి కోరికలు కోరచ్చా అని కొందరు ప్రశ్నించారు. ఇది సమాజం తీరుతెన్నులపై విసిరిన ఓ సెటైర్ ఈ యాడ్ అని మరికొందరు చెప్పుకొచ్చారు. జెప్టోలో ఆర్డరిస్తే 10 నిమిషాల్లో వరుడు ఇంటికి డెలివరీ అయిపోతాడు అని మరికొందరు సెటైర్లు పేల్చారు. ఇలాగైతే మగాళ్లకు ప్రశాంతంగా అపానవాయువు వదిలే అవకాశం కూడా ఉండదా అంటూ ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశారు.

మరో నెటిజన్ మాత్రం ఈ యాడ్ వెనకున్న చరిత్ర చెప్పుకొచ్చాడు. ఈ యాడ్ 2021 నాటిదని, ఓ యువతి సోదరుడు ఇచ్చాడని వివరించాడు. మహిళలపై సమాజం మోపుతున్న అసాధారణ అంచనాల భారాన్ని విమర్శిస్తూ ఈ వ్యంగ్యపూరిత యాడ్ ఇచ్చాడని తెలిపాడు. నాటి నుంచీ ఏదోక సందర్భంలో ఈ యాడ్ వైరల్ అవుతూ వస్తోందని చెప్పాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..

Read Latest and Viral News

Updated Date - Nov 25 , 2024 | 10:42 PM