Share News

Viral: 17 రోజుల టూర్ తరువాత ఇంటికొచ్చిన మహిళకు భారీ షాక్!

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:08 PM

పదిహేడు రోజుల పాటు సుదీర్ఘ పర్యటన ముగించుకుని ఇంటికొచ్చిన ఓ మహిళకు భారీ షాక్ తగిలింది. ఇంట్లోని ఒవెన్‌లో కనిపించిన దృశ్యం చూసి షాకైపోయిన ఆమె తన గోడును నెట్టింట వెళ్లబోసుకుంది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: 17 రోజుల టూర్ తరువాత ఇంటికొచ్చిన మహిళకు భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: పదిహేడు రోజుల పాటు సుదీర్ఘ పర్యటన ముగించుకుని ఇంటికొచ్చిన ఓ మహిళకు భారీ షాక్ తగిలింది. ఇంట్లోని ఒవెన్‌లో కనిపించిన దృశ్యం చూసి షాకైపోయిన ఆమె తన గోడును నెట్టింట వెళ్లబోసుకుంది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా సంచలనంగా (Viral) మారింది.

Viral: గంటలకొద్దీ ఒకే చోట నిలబడ్డ గుర్రంతో ఫొటో కోసం ట్రై చేస్తే.. !


ప్రముఖ చర్చా వేదిక రెడిట్‌లో మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆమె ఇటీవలే 17 రోజుల టూర్ ముగించుకుని ఇంటికొచ్చింది. కాసేపు సేద తీరాక వంటింట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె మైక్రోవేవ్ ఒవెన్‌లో దృశ్యం చూసి ఆమె షాకైపోయింది. ఒవెన లోపల పైభాగం నుంచి ఏవో తెల్లని తీగలు చిక్కుపడి వేళాడుతున్నట్టు కనిపించాయి. అసలదేంటో కూడా మహిళకు అర్థంకాలేదు. ఒవెన్ తలుపు తీసే సాహసం కూడా ఆమె చేయలేకపోయింది. చివరకు దాన్ని ఫొటో తీసి నెట్టింట పంచుకుంది (Woman Shocked by Strange Sight Inside Oven Upon Return After 17 Day Trip ).


ఇక ఫొటో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. ఒవెన్ లోపల ఏదైనా ఫంగస్ పెరిగి ఉండొచ్చని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. ఒవెన్ లోపల ఇన్సూలేషన్ ఉంటుందని, దాన్ని ఏదైనా ఎలక కొరికి కిందకు లాగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 10:08 PM