Share News

Viral: దుబాయ్‌లో దారుణం.. యువతిని బొమ్మల మధ్య నిలబెట్టి..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:10 PM

దుస్తుల ప్రదర్శనకు ఉద్దేశించిన బొమ్మలు( మెనక్వీన్స్) మధ్య ఓ యువతిని కూడా బొమ్మలాగా నిలబెట్టడంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లోని మాంటో బ్రైడ్ అనే మహిళల దుస్తుల షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral: దుబాయ్‌లో దారుణం.. యువతిని బొమ్మల మధ్య నిలబెట్టి..

ఇంటర్నెట్ డెస్క్: దుస్తుల ప్రదర్శనకు ఉద్దేశించిన బొమ్మల( మెనక్వీన్స్) మధ్య ఓ యువతిని కూడా బొమ్మలాగా నిలబెట్టడంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లోని మాంటో బ్రైడ్ అనే మహిళల దుస్తుల షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, బొమ్మల మధ్య ఫ్యాషన్ దుస్తులను ధరించి నిలబడ్డ మహిళే ఈ ఫొటోను షేర్ చేయడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది (Viral).

యాంజెలీనా అనే మోడల్ దుస్తుల షాపులో మెనక్వీన్ లాగా నిలబడి పోజులిచ్చింది. ఇది లవిన్ దుబాయ్ అనే అకౌంట్‌లో దర్శనమిచ్చి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. దుబాయ్‌లో మార్కెటింగ్ ఏ రేంజ్‌ ఉంటుందో చూడండి అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ జతచేశారు (Woman Stands On Display At Clothing Store In Dubai).

Viral: ఒక్క పైసా కోసం బ్యాంకు దోపిడీ! చివరకు ఏం జరిగిందంటే..


ఈ ఫొటో నెట్టింట కాలు పెట్టీ పెట్టగానే చర్చకు దారి తీసింది. యువతిని అలా నిలబెట్టడంపై విమర్శలు గుప్పించారు. ఇది ఆధునిక కాలంలో చూస్తున్న బానిసత్వం అని కొందరు అన్నారు. మానవత్వం నశిస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దుస్తుల ప్రదర్శనకు బొమ్మలు ఉండగా ఓ మనిషిని అలా గంటల తరబడి నిలబెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కొందరేమో ఇదో అద్భుత మార్కెటింగ్ వ్యూహంగా అభివర్ణించారు. ఎలాగొలా వార్తల్లోకి ఎక్కాలనే ఇలా చేసి ఉండొచ్చని కొందరు అన్నారు.

మరికొందరు మాత్రం ఈ అంశంపై రాద్ధాంతం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అంతా తెలిసే యువతి ఆ ఉద్యోగానికి ఒప్పుకుని ఉంటుందని, పనికి తగిన పారితోషికం తీసుకుని ఉంటుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 03:14 PM