Viral: దేవుడా.. ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ మహిళ ఎలాంటి పని చేసిందో చూస్తే..
ABN , Publish Date - Mar 21 , 2024 | 03:03 PM
ఐస్‌క్రీమ్‌తో జుట్టుకు రంగు వేయాలన్న ఓ మహిళ ప్రయత్నం ఊహించని విధంగా బెడిసికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట చిట్కాల పేరిట నిత్యం ఏదోక వీడియో ట్రెండవుతూనే (Viral Video)ఉంటుంది. అయితే, ఇలాంటి వాటిని ఫాలో అయ్యేందుకు చాలా మంది వెనకడుగు వేస్తారు. తొందరపడితే సమస్యలు తప్పవు కాబట్టి విజ్ఞతతో వ్యవహరిస్తుంటారు. కానీ, ఓ కంటెంట్ క్రియేటర్ మాత్రం తన ఫాలోవర్లను ఆకట్టుకోవాలనే ఆలోచనతో ఈ జాగ్రత్తలన్నీ పక్కనపెట్టేసింది. తనకు ఎవరో పంపించిన వీడియోలో ఉన్నట్టుగా తనూ జుట్టుకు ఐస్‌క్రీమ్‌తో రంగేసుకుంది. సుమన్ అనే కంటెంట్ క్రియేటర్ చేసిన ఈ అసాధారణ చర్య నెటిజన్లు షాకయ్యేలా చేస్తోంది.
Exercise Pill: ఈ టాబ్లెట్ వేసుకుంటే జిమ్‌కు వెళ్లక్కర్లేదు! కాలు కదపకుండానే కసరత్తుల బెనిఫిట్స్!
వీడియోలో సుమన్ చెప్పిన దాని ప్రకారం, ఆమె తన జుట్టును బ్రౌన్ కలర్‌లోకి మార్చుకోవాలనుకుంది. ఈ రంగులో ఉన్న ఐస్‌క్రీమ్‌ను జుట్టుకుపట్టిస్తే రంగుమారిపోతుందని ఎవరో చెప్పడంతో ఆమె అలాగే ట్రై చేసింది. మూడు చాక్లెట్ ఐస్‌క్రీమ్‌లు తెప్పించుకుని వాటిని చేతులతో పేస్ట్‌లాగా చేసి జుట్టుకు బాగా పట్టించింది (Woman colors her hair with Ice Cream). కాసేపాగాక చూస్తే జుట్టు రంగు అస్సలు మారలేదు. దీంతో, ఇలాంటిది ఎవరో చేయొద్దని చెప్పుకొచ్చింది.
Viral: హాస్టల్ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! పోలీసులు వచ్చి చూస్తే..
అయితే, తన ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేయాలనుకున్న సుమన్ ప్రయత్నం ఊహించని విధంగా బ్యాక్‌ఫైర్ అయ్యింది. అనేక మంది ఆమెను తిట్టిపోశారు. కొందరు హేళనలకు కూడా దిగారు. ‘చాక్లె్ట్‌కు బదులు ఫెవీకాల్ వాడి చూడు’ అంటూ ఓ నెటిజన్ ఎకసెక్కాలాడారు. ‘ఈసారి బబల్‌గమ్ ట్రైసి చూడు..రంగు మారొచ్చు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొందరేమో ఆహారాన్ని ఇలా వేస్ట్ చేసినందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి