Viral: విమానం నడుపుతున్న భర్తకు గుండెపోటు! ఒంటరైన భార్య ఊహించని విధంగా..
ABN , Publish Date - Oct 11 , 2024 | 08:35 AM
విమానం నడుపుతున్న భర్తకు సడెన్‌గా గుండెపోటు రావడంతో ఆయన భార్య స్వయంగా విమానాన్ని ల్యాండ్ చేసింది. గతంలో ఎన్నడూ విమానం నడపకపోయినా ఆమె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలను అనుసరిస్తూ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నె్ట్ డెస్క్: ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! ఓ వ్యక్తి విమానం నడుపుతుండగా అతడి భార్య పక్కన కూర్చుంది. ఇంతలో భర్తకు గుండెపొటు రావడంతో అచేతనంగా మారిపోయాడు. భార్యకు విమానం నడిపిన అనుభవమే లేదు. అయినా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. అమెరికాలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది.
Turkish Airlines: మార్గమధ్యంలో పైలట్ మరణం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కినానే వెల్స్ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆమె భర్త ఎలియట్ ఆల్పర్ (78). ఇటీవల ఆ జంట ఓ తేలికపాటి విమానంలో నెవార్క్‌లోని హెండర్సన్ విమానాశ్రయం నుంచి కాలిఫోర్నియాలోని మాటెరీకి బయలుదేరింది. అయితే, విమానం మార్గమధ్యంలో ఉండగానే ఎలియట్‌కు గుండెపోటు వచ్చింది.
భర్త అచేతనంగా మారిపోవడం చూసి మహిళ తలకిందులైపోయింది. ఆమెకు ఏం చేయాలో తెలీక చివరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించింది. మహిళకు విమానం నడిపిన అనుభవం లేదని గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది..విమానం ల్యాండింగ్ గురించి ఆమెకు అర్థమయ్యే రీతిలో వివరించారు. దీంతో, ఆమె విమానాన్ని బేకర్స్‌ఫీల్డ్‌లోని మెడోస్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఆ తరువాత అత్యవసర సిబ్బంది ఆమె భర్తను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకునేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు అతడు మృతి చెందినట్టు ప్రకటించారు.
Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!
కాగా, ఈ ఘటనపై కెర్న్ కౌంటీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ రాన్ బ్రూస్టర్ స్పందించారు. ఇదో అసాధారణ ఘటన అని అభివర్ణించారు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి ఉదంతాన్ని చూడలేదని అన్నారు. మరోవైపు, ఈ ఉదంతంపై ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ, నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు దృష్టిసారించాయి. దర్యాప్తునకు ఆదేశించాయి.