Share News

Viral: ఇండియా బెటరా లేక విదేశాలా? పెద్ద చర్చకు తెరతీసిన యువతి కామెంట్!

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:34 PM

విదేశాల్లో లైఫ్‌కి భారత్‌లో జీవితాన్ని పోల్చుతూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Viral: ఇండియా బెటరా లేక విదేశాలా? పెద్ద చర్చకు తెరతీసిన యువతి కామెంట్!

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో లైఫ్‌కి భారత్‌లో జీవితాన్ని పోల్చుతూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) ఉంది. నీహారికా కౌర్ సోధీ అనే యువతి ఈ పోస్టు పెట్టింది. భారత్‌లో ఉన్నప్పుడు తనకు విలాసవంతమైన జీవితం అంటే ఏంటనేదానిపై ఓ అభిప్రాయం ఉండేదని, అమెరికాకు వచ్చాక ఆ అభిప్రాయంలో మార్చు వచ్చిందని అమె చెప్పుకొచ్చింది.

Viral: జీప్ వీడియోతో స్ఫూర్తివంతమైన సందేశం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..


‘‘అమెరికాకు వచ్చి 11 రోజులు అయ్యింది. ఏదో ఆలోచిస్తుండగా నిన్న సాయంత్రం ఈ విషయం స్ఫురించింది. భారత్‌లో ఉండగా నాకు లగ్జరీ లైఫ్ అంటే నాకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు, గ్రాసరీ డెలివరీలు, ఇంటిపనుల కోసం తక్కువ ఖర్చులో లభించే సహాయకురాలు.. వంటి అభిప్రాయాలు ఉండేవి. కానీ అసలు నాణ్యమైన జీవితం అంటే శుభ్రమైన గాలి, నిరంతర విద్యుత్ సరఫరా, మంచి నీరు, చుట్టూ పచ్చదనం, మంచి రోడ్లు అని అమెరికాకు వచ్చాక అనిపించింది. అసలు లగ్జరీ అంటే విద్యుత్ కోతల్లేకుండా ఏసీ నిత్యం అందుబాటులో ఉండటం. మగ చూపుల ఇబ్బంది లేకుండా నచ్చిన డ్రెస్ వేసుకుని తిరగడం’’ అని ఆమె చెప్పుకొచ్చింది (Womans Post On Quality Of Life In India Vs US Sparks Online Debate).

దీనిపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది యువతితో ఏకీభవించారు. పదిహేనేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండి ఇటీవలే ఇండియాకు వచ్చిన తాను యువతి భావాన్ని అర్థం చేసుకోగలనని ఓ వ్యక్తి చెప్పారు. భారత్‌లోని గ్రామాల్లో కూడా దాదాపు ఇదే వాతావరణం ఉంటుందని చెప్పారు. నగరానికి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో కూడా ఇలాంటి అనుభవం పొందొచ్చని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 06:34 PM