Viral: వంట చేయలేనని కాబోయే వాడితో అన్న యువతి! చివరకు జరిగిందేంటో తెలిస్తే..
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:03 PM
నేటి తరంలో మహిళలకు వంట కచ్చితంగా వచ్చుండాలా? వంట రాని వాళ్లు పెళ్లికి తగరా? ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం నెట్టింట ఇవే ప్రశ్నలపై తెగ చర్చ నడుస్తోంది. ఓ మహిళ ఇటీవల నెట్టింట పెట్టిన పోస్టు ఈ చర్చను రాజేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరంలో మహిళలకు వంట కచ్చితంగా వచ్చుండాలా? వంట రాని వాళ్లు పెళ్లికి తగరా? ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం నెట్టింట ఇవే ప్రశ్నలపై తెగ చర్చ నడుస్తోంది. ఓ మహిళ పెట్టిన పోస్టు ఈ చర్చను రాజేసింది. దీనిపై జనాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు (Viral).
Sleep Divorce: స్లీప్ డైవర్స్.. యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్!
ఇటీవల సదరు మహిళకు వచ్చిన సంబంధం చివర్లో చెడిపోయింది. అభిరుచులు కలవకపోవడంతో ఆ అబ్బాయి మహిళను రిజెక్టు చేశారు. ఇందుకు గల కారణాలను చెబుతూ మహిళ ఈ పోస్టు పెట్టింది. తాము మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఒకరికొకరం పరిచయమైనట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తాము ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లామని చెప్పింది. అబ్బాయి తన తెలివితేటలు అందచందాలను పొగిడేశాడని తెలిపింది.
‘‘అప్పటివరకూ మా మధ్య సంభాషణ బాగానే సాగింది. అతడికి నేను నచ్చినట్టే అనిపించింది. కానీ పెళ్లయ్యాక వంట చేయలేనని చెప్పా. ఆఫీసులో పని కారణంగా నాకు అంత టైం ఉండదని అన్నా. ఆ మాట అనగానే అతడి ముఖం మారిపోయింది. ఆ తరువాత మాట్రిమోనియల్ సైట్లో నన్ను అన్‌మ్యాచ్ చేసేశాడు. పెళ్లికి సంబంధించి వంట అంతటి ముఖ్యమైన విషయమా?’’ అని ఆమె ప్రశ్నించింది.
Viral: ఈసారి లాటరీ గెలుస్తానని జోక్ చేశాడు! చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!
ఈ పోస్టు పెట్టగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు మహిళ పరిస్థితికి విచారం వ్యక్తం చేయగా మరికొందరు అబ్బాయి అభిరుచిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘అతడు మీతో నిజాయతీగా వ్యవహరించినందుకు సంతోషించాలి. కాబోయే భార్యపై అతడికి కొన్ని అంచనాలు ఉండొచ్చు. అందరికీ ఇవి ఉంటాయి. ఈ విషయంలో ఇప్పుడు మౌనంగా ఉండి పెళ్లయ్యాక వివాదం రాజేసి ఉంటే మరింత దారుణంగా ఉండేది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘భార్యాభర్తలు ఇంటి పనులన్నీ చెరిసగం పంచుకోవడం మంచిది. సమానత్వం అన్ని విషయాల్లో ఉండాలి’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘వంట రానంత మాత్రాన నేనైతే ఎవరినీ రిజెక్ట్ చేయను. కానీ ఇది యువతీయువకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ‘‘ఒక వేళ అతను నేను పైసా సంపాదించను.. ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటా అంటే నువ్వు అంగీకరిస్తావా’’ మరో వ్యక్తి ప్రశ్నించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Viral: ఇంతకు తెగించారేంట్రా దేవుడా! ఈ యువతులు చేసిన దారుణం చూస్తే..