Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!
ABN , Publish Date - Nov 18 , 2024 | 07:54 PM
స్వీడెన్‌కు చెందిన ఓ మహిళా మంత్రికి అరటి పళ్లంటే భయం కావడంతో ఆమె అధికారిక కార్యక్రమాల్లో అరటి వినియోగం నిషేధం విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీడెన్‌కు చెందిన ఓ మహిళా మంత్రికి అరటి పళ్లంటే భయం కావడంతో ఆమె అధికారిక కార్యక్రమాల్లో అరటి వినియోగం నిషేధం విధించారు. ఈ మేరకు స్థానిక మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈమెయిల్ లీక్స్ ద్వారా తమకు ఈ సమాచారం అందిందని సదరు వార్తా సంస్థ పేర్కొంది (Viral).
Viral: లాటరీలో రూ.20 కోట్లు గెలిచాక మహిళ జీవితం తారుమారు! విధి అంటే ఇదేనేమో!
మీడియా కథనాల ప్రకారం, స్త్రీపురుష సమానత్వ శాఖ మంత్రి పాలీనా బ్రాండ్‌బర్గ్‌కు అరటి పళ్లంటే ‘ఎలర్జీ’ ఉండటంతో ఆమె హారజయ్యే కార్యక్రమాల్లో అరటి పళ్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారట. అయితే, ఈ విషయంపై మంత్రి కూడా స్పందించారు. తనకు అరటి అంటే అలర్జీ కాదని, అసాధారణ ఫోబియా అని ఆమె చెప్పారు. ఈ ఫోబియా లక్షణాలు కూడా అలర్జీని పోలి ఉండటంతో తనకు అరటి అంటే ఎలర్జీ అన్న వార్త వైరల్ అయినట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఫోబియా కారణంగా తన జీవితంపై తీవ్ర ప్రభావం పడిందని, అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని ఆమె చెప్పుకొచ్చారు.
Viral: ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలు.. బాలిక తండ్రి గగ్గోలు
ఏమిటీ ఫోబియా..
ఏదైనా వస్తువు లేదా అంశం తీవ్ర భయానికి దారితీస్తే దాన్ని ఫోబియా అంటారు. కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే ఈ భయం ఉంటుంది. మరికొందరు సాలీళ్లను చూస్తే ఫోబియా చుట్టుముడుతుంది. ఇక తాజా ఉదంతంలో మంత్రి బ్రాండ్‌బర్గ్ ‘బనానా ఫోబియాతో’ బాధపడుతున్నారు. ఫోబియాల్లోకెల్లా అత్యంత వింతనైనది ఇదే అని ఆమె నాలుగేళ్ల క్రితం ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇక బనానా ఫోబియా ఉన్న వాళ్లు అరటి పళ్లను చూసినా, వాటి వాసనను పీల్చినా కడుపులో తిప్పడం, వాంతులు, ఆందోళన వంటి వాటితో సతమమవుతారు. అయితే, ఈ ఫోబియాకు కారణమేంటో మాత్రం వైద్యులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. చిన్నతనంలో ఎదురైన ఘటనలు కొన్ని ఈ పరిస్థితికి దారి తీయచ్చని అంటున్నారు. ఇది చాలా అరుదైన ఫోబియా అని మాత్రం స్పష్టం చేస్తున్నారు.
Viral: ఈ సింహం ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి.. తృటిలో తప్పిన చావు!
స్వీడెన్‌కు చెందిన మరో ఎంపీ టెరెసా కార్వాల్హో కూడా ఇదే తరహా ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు. మంత్రి బ్రాండ్‌బర్గ్ పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నో విషయాల్లో తాము విభేదించినా ఈ విషయంలో మాత్రం తమ మధ్య ఏకాభిప్రాయం ఉందని వ్యాఖ్యానించారు. వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఈ ఫోబియాను సైకలాజికల్ శిక్షణ ద్వారా కొంత వరకూ నయం చేయవచ్చు. కాగ్నిటివ్ బిహేవియొరల్ థెరపీ ద్వారా అరటి వల్ల కలిగే ప్రతికూల భావనలను అధిగమించేలా శిక్షణ ఇస్తారు.
Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా