Viral: యువరాజ్ సింగ్ ఎన్జీవో యాడ్.. విమర్శలు
ABN , Publish Date - Oct 24 , 2024 | 08:36 PM
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చెందిన ఎన్జీవో ‘యూవీకెన్’పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సంస్థ రూపొందించిన ఓ యాడ్ చూసి జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చెందిన ఎన్జీవో ‘యూవీకెన్’పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు సంస్థ రూపొందించిన ఓ యాడ్ చూసి జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఈ ప్రకటన కనిపించగా వెంటనే అప్రమత్తమైన మెట్రో అధికారులు దాన్ని తొలగించారు (Viral).
Viral: వీడ్కోలు కౌగిలింతలకు టైం లిమిట్! న్యూజిలాండ్ ఎయిర్ పోర్టు ఆదేశాలు!
బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తరచూ మహిళలను తమని తాము పరిశీలించుకోవాలంటూ యూవీకెన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కోసం అభ్యంతరకర పదజాలాన్ని వాడింది. మహిళలు నెలకోసారి తమ నారింజలను చెక్ చేసుకోవాలంటూ అసభ్యమైన క్యాప్షన్ పెట్టింది. ఈ మేరకు ఏఐ ద్వారా రూపొందించిన పోస్టర్‌ను ఓ మెట్రో కోచ్‌లో అమర్చింది. ఈ పోస్టర్‌ను ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇలాగైతే దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన ఎలా పెంచగలం. మీ నారింజలను చెక్ చేసుకోండంటూ ఎవరైనా ప్రచార పోస్టర్లను డిజైన్ చేస్తారా? అసలు ఈ ప్రకటనను ఎవరు అనుమతించారు? ఇలాంటి మూర్ఖులు మన మధ్య ఉన్నారా? ఇది సిగ్గుమాలిన చర్య’’ అని సదరు నెటిజన్ దుయ్యబట్టారు.
Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..
మరో పోస్టులో సదరు నెటిజన్ యువరాజ్‌ను కూడా ట్యాగ్ చేశారు. ‘‘హాయ్ యువరాజ్.. ఇది నీ ఎన్జీఓ ఇచ్చిన ప్రకటన అని తెలిసింది. నీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఈ ప్రకటనను ప్రచారకార్యక్రమం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. నమ్మలేకపోతున్నా’’ అని పోస్టు పెట్టారు.
ఢిల్లీ మెట్రోపై కూడా సదరు నెటిజన్ విమర్శలు గుప్పించారు. ‘‘విలువలకు అస్సలు అనుగుణంగా లేని ఇలాంటి ప్రకటనను ఈ మధ్యలో ఎప్పుడూ చూడలేదు. డబ్బులిస్తే మీరు ఎలాంటి ప్రకటనలైనా అనుమతిస్తారా? దీన్ని వెంటనే తొలగించండి. యూవీకెన్ సంస్థ కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఇలాంటివి అస్సలు చేయకూడదు’’ అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Viral: ఇందుకేగా పిల్లల జీవితాలు నాశనమయ్యేది! తండ్రి అయ్యుండీ ఇలా చేయొచ్చా?
ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన రావడంతో పాటు జనాలు యువరాజ్ సింగ్‌పైనా విమర్శలు గుప్పించారు. స్వయంగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన యూవీకి చెందిన ఎన్జీవో ఇలాంటి ప్రకటన ఇవ్వొచ్చా అని ప్రశ్నించారు. దీని వల్ల పోకిరీలు వెలికి నవ్వులు నవ్వుకుంటారని, మహిళలు ఇబ్బంది పడతారని ఎన్జీవోపై దుమ్మెత్తిపోశారు.
కాగా, ఘటనపై ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. జనాలు విమర్శిస్తున్న యాడ్ ఒక కోచ్‌లో మాత్రమే కనిపించిందని, దాన్ని కూడా తొలగించామని వివరణ ఇచ్చింది. యాడ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తక్షణం స్పందించారని తెలిపింది.