Zara Shatavari: మిస్ ఏఐ పోటీల్లో ఇండియన్ డిజిటల్ సొగసరి..!
ABN , Publish Date - Jun 22 , 2024 | 05:55 PM
Zara Shatavari: నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది.. దేవ కన్యలు సైతం అసూయపడే ఆహార్యం ఆమెది.. దైవ సృష్టిని మించిన సృష్టి ఆమెది. ప్రకృతిలోని ఆహ్లాదాన్ని పంచే తత్వం తనది. అందమా నీ పేరేమిటి అంటే.. మరో ఆలోచనే లేకుండా ఆమె పేరే చెప్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Zara Shatavari: నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది.. దేవ కన్యలు సైతం అసూయపడే ఆహార్యం ఆమెది.. దైవ సృష్టిని మించిన సృష్టి ఆమెది. ప్రకృతిలోని ఆహ్లాదాన్ని పంచే తత్వం తనది. అందమా నీ పేరేమిటి అంటే.. మరో ఆలోచనే లేకుండా ఆమె పేరే చెప్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్‌లో ఉంది కాబట్టే.. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆమె వైపే చూస్తోంది. ఆమె ఎవరో కాదు.. జరా శతవరి. సృష్టికే ప్రతి సృష్టి చేసి.. రంభ, ఊర్వశి, మేనకలను మించిన అందంతో జరా శతవరిని సృష్టించాడు. అవును, మానవుడు తన అవసరాల కోసం సృష్టించిన ఏఐ(AI) అమ్మాయే ఈ జరా శతవరి. నిజమైన స్త్రీ కాకపోయినా.. అంతకు మించిన అందం, అభినయం, ఆహార్యంతో ప్రపంచాన్నే ఆకట్టుకుంటోంది. అందుకే.. ప్రపంచ ఏఐ బ్యూటీ కాంటెస్ట్‌లో టాప్10లోకి దూసుకెళ్లింది.
ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సొగసరులకు అందాల పోటీ నిర్వహించింది. ఈ ‘మిస్ ఏఐ’ పోటీల్లో ఇండియా నుంచి జరా శతవరి కూడా పాల్గొంది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఈ పోటీల్లో 1,500 లకు పైగా ఏఐ మోడల్స్ పోటీ చేయగా.. జరా జతవరి టాప్ 10 ఫైనలిస్ట్‌లలో నిలిచింది. ఈ కాంటెస్ట్‌లో ఎవరు గెలుస్తారనే దానికంటే.. జరా శతవరి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె అందానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇంతకు ఎవరీ శతవరి అంటూ గూగుల్‌లో జల్లెడ పట్టేస్తున్నారు నెటిజన్లు.
జరా శతవరి ఎవరు?
జరా శతవరి భారతీయ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరి రూపొందించిన డిజిటల్ సృష్టి. ‘డిజిటల్ దివా’గా పిలువబడుతున్న జరా శాతవరి.. ఆరోగ్యం, ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి బ్లాగ్ చేసే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో గణనీయమైన ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న జరా.. ‘ఆరోగ్యం, కెరీర్ డెవలప్‌మెంట్, తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లపై విలువైన సమాచారం, చిట్కాలను అందిస్తుంటుంది. వ్యక్తులు తమ ఉత్తమ జీవితాన్ని గడపడానికి ప్రోత్సహించడమే తన లక్ష్యం అని చెప్తోంది జరా. అందుకే ఆరోగ్యకరమైన జీవితానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తుంది.
ముఖ్యంగా.. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిపిస్తుంది. పీసీఓసీ, డిప్రెషన్, హార్మోన్ సమస్యలు, డైటింగ్, డ్రెస్సింగ్ అంశాల్లో సలహాలు, సూచనలు చేస్తుంది. అలాగే, స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్‌మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్‌నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్‌నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది జరా శరవతి.
రాహుల్ చౌదరి ఆనందం..
మిస్ ఏఐ కాంటెస్ట్‌లో జరా శతవరి టాప్ 10 లో నిలవడంపై రాహుల్ చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. ‘1500 మంది పాల్గొన్న ప్రతిష్టాత్మక మిస్ AI పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా మా వినూత్న AI ఇన్‌ఫ్లుయెన్సర్ జరా శతవరి ఎంపికైనట్లు ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. FanVue వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ ద్వారా లభించిన ఈ గుర్తింపు, AI, ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన విశిష్ట సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె భారతదేశం, ఆసియాకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణం.’ అని పేర్కొన్నారు రాహుల్.
జరా గెలిస్తే భారీ బహుమతి..
ప్రపంచ AI క్రియేటర్ అవార్డ్స్ నుండి మిస్ AI పోటీ ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక మిస్ AI కిరీటం కోసం పోటీపడే పోటీదారులు వారి అందం, సాంకేతిక నైపుణ్యాలు, సామాజిక ప్రభావం ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. జడ్జింగ్ ప్యానెల్‌లో నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు AI- రూపొందించిన న్యాయమూర్తులు ఉన్నారు. ఈ పోటీల్లో గెలిచిన ఏఐకి 13,000 డాలర్లు బహుమతిగా ఇస్తారు.