Share News

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..

ABN , Publish Date - Jul 28 , 2024 | 07:38 AM

పారిస్ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్‌కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో షూటింగ్(shooting), అర్చరీ(archery) ఈవెంట్లలో ఇండియా తన ఖాతాను నేడు(జులై 28న) తెరవాలని చూస్తోంది. 20 ఏళ్లలో ఒలింపిక్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్(manu bhaker) రికార్డు సృష్టించింది.

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..
Paris Olympics 2024 india

పారిస్ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్‌కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో షూటింగ్(shooting), అర్చరీ(archery) ఈవెంట్లలో ఇండియా తన ఖాతాను రెండో రోజైన నేడు(జులై 28న) తెరవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే 20 ఏళ్లలో ఒలింపిక్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్(manu bhaker) ఇప్పటికే రికార్డు సృష్టించింది. క్వాలిఫికేషన్‌లో 22 ఏళ్ల భాకర్ 580 పాయింట్లు చేసి మూడో స్థానంలో నిలువగా, హంగేరియన్ షూటర్ వెరోనికా మేజర్ 582 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఈ 22 ఏళ్ల యువతి ప్రదర్శనను బట్టి మెడల్ దాదాపు ఖారారు కానుంది.


ఆర్చరీలో కూడా

మరోవైపు అర్చరీ(archery)లో దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్‌లతో కూడిన మహిళల ఆర్చరీ జట్టు ఓ పతకాన్ని గెల్చుకునే అవకాశం ఉంది. జులై 25న జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన తర్వాత, ముగ్గురు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచులో ఏదో ఒక మెడల్ ఖారారయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు నేడు జరిగే పలు ఈవెంట్లలో కూడా భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే మరిన్ని మెడల్స్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.


పారిస్ ఒలింపిక్స్ 2024 రెండో రోజు (జులై 28న) భారత్ తరఫున ఆడనున్న క్రీడాకారుల షెడ్యూల్

  • మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: ఎలవెనిల్ వలరివన్, రమిత, మధ్యాహ్నం 12:45 గంటలకు IST

  • పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, మధ్యాహ్నం 2:45 IST

  • మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెడల్ ఈవెంట్: మను భాకర్, మధ్యాహ్నం 3:30 IST

  • మహిళల సింగిల్స్ (గ్రూప్ మ్యాచ్): PV సింధు vs FN అబ్దుల్ రజాక్, 12:50 PM IST

  • పురుషుల సింగిల్స్ (గ్రూప్ మ్యాచ్): HS ప్రణయ్ రాయ్ vs ఫాబియన్ రోత్, 8 PM IST


  • రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్ (రిపీచ్): బాల్‌రాజ్ పన్వార్, మధ్యాహ్నం 1:18 IST

  • ఆర్చరీ మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్స్): భారత్ (అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి) vs ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్ - 5:45 PM IST

  • ఆర్చరీ మహిళల జట్టు (సెమీ-ఫైనల్): 7:17 pm IST

  • ఆర్చరీ మహిళల జట్టు (పతక దశ మ్యాచ్‌లు): 8:18 PM IST

  • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 64): శ్రీజ అకుల vs క్రిస్టినా కల్బెర్గ్ - 12:15 PM IST

  • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 64): మనికా బాత్రా vs అన్నా హర్సే - 12:15 PM IST


  • పురుషుల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 64): శరత్ కమల్ vs డెన్నీ కోజుల్ - 3:00 PM IST

  • పురుషుల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 64): హర్మీత్ దేశాయ్ vs ఫెలిక్స్ లెబర్న్ - 3:00 PM IST

  • స్విమ్మింగ్ పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ (హీట్ 2): శ్రీహరి నటరాజ - మధ్యాహ్నం 3:16 IST

  • మహిళల 200మీ ఫ్రీస్టైల్ (హీట్ 1): ధినిధి దేశింగు - మధ్యాహ్నం 3:30 IST

  • బాక్సింగ్ మహిళల 50 కిలోల విభాగం: (రౌండ్ ఆఫ్ 32): నిఖత్ జరీన్ vs మాక్సీ క్లోట్జర్ - 3:50 PM IST

  • టెన్నిస్ పురుషుల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 64): సుమిత్ నాగల్ vs కోర్టేనే మౌటెట్ - 4:55 PM IST

  • టెన్నిస్ పురుషుల డబుల్స్ (రౌండ్ ఆఫ్ 32): ఎన్ శ్రీరామ్ బాలాజీ & రోహన్ బోపన్న vs ఫాబియన్ రెబుల్ & ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ - 5:15 PM IST


మొదటి రోజు భారత్ ఖాతాను తెరవలేదు. కానీ చిన్న దేశమైన ఆస్ట్రేలియా మాత్రం మొదటిరోజు 5 పతకాలను గెల్చుకుని ఆగ్రస్థానంలో నిలిచింది.

పారిస్ ఒలింపిక్స్ 2024: పతకాల పట్టిక

దేశం - గోల్డ్, సిల్వర్, కాంస్యం - మొత్తం

  • ఆస్ట్రేలియా - 3 2 0 - 5

  • చైనా- 2 0 1 - 3

  • అమెరికా - 1 2 2 - 5

  • ఫ్రాన్స్ - 1 2 1 - 4

  • భారత్ - 0 0 0 - 0


ఇవి కూడా చదవండి:

Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..


first T20 India vs Sri Lanka : ‘టాప్‌’షోతో బోణీ


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 07:42 AM