Share News

Allu Arjun Release: అల్లు అర్జున్‌ కోసం రింకూ సింగ్.. పుష్పరాజ్‌కు స్టార్ క్రికెటర్ సపోర్ట్

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:59 PM

Allu Arjun Release: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌కు టీమిండియా స్టైలిష్ బ్యాటర్ రింకూ సింగ్ మద్దతు తెలిపాడు. బన్నీ కోసం స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.

Allu Arjun Release: అల్లు అర్జున్‌ కోసం రింకూ సింగ్.. పుష్పరాజ్‌కు స్టార్ క్రికెటర్ సపోర్ట్
Rinku Singh

Allu Arjun-Rinku Singh: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జైలు నుంచి విడుదలయ్యారు. రిలీజైన వెంటనే నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు చేరుకున్న బన్నీ.. అక్కడి నుంచి ఇంటికి బయల్దేరారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు టాలీవుడ్ కదిలింది. డైరెక్టర్ సుకుమార్ దగ్గర నుంచి కొరటాల శివ వరకు, నిర్మాత దిల్ రాజు నుంచి నాగవంశీ దాకా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి దగ్గుబాటి రానా వరకు అందరూ బన్నీని కలిశారు. ఈ తరుణంలో పుష్పరాజ్‌కు టీమిండియా స్టార్ హిట్టర్ రింకూ సింగ్ కూడా సపోర్ట్‌గా నిలవడం విశేషం.


గడ్డం సవరిస్తూ..

అల్లు అర్జున్‌కు సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు క్రికెటర్ల నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. తాజాగా భారత స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ బన్నీకి తన మద్దతు తెలియజేశాడు. ఐకాన్ స్టార్‌కు సపోర్ట్‌గా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రింకూ. ఇందులో ఐకానిక్‌గా మారిన తగ్గేదేలే పోజు ఇస్తూ కనిపించాడతను. ఇందులో ఇతర ప్లేయర్లతో కలసి సందడి చేశాడతను. ‘పుష్ప 2’ మూవీలోని ‘పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్’ అనే సాంగ్ ప్లే అవుతుండగా.. రింకూ చేతితో బన్నీ మాదిరిగా గడ్డం సవరిస్తూ కనిపించాడు.


చెక్కుచెదరని క్రేజ్

రింకూ సింగ్ వీడియో చూసిన నెటిజన్స్.. బన్నీ టఫ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్న తరుణంలో భారత క్రికెటర్ ఇలా మద్దతుగా నిలవడం శుభపరిణామమని అంటున్నారు. పుష్ప 2 మూవీ, అందులోని అల్లు అర్జున్ నటనను మొత్తం దేశం ఆస్వాదిస్తోందని.. రింకూకు కూడా ఎంతో నచ్చబట్టే ఈ వీడియో చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనసుల్ని రింకూ దోచుకున్నాడని చెబుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా బన్నీ నిలబడి ఫైట్ చేస్తాడని.. ఆయనకు ఉన్న క్రేజ్, పాపులారిటీ చెక్కుచెదరలేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.


Also Read:

అన్వయ్‌ ద్రవిడ్‌ అజేయ శతకం

ఫైనల్లో ముంబై, ఎంపీ

అదరగొట్టిన జంగూ

For More Sports And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 01:01 PM