Share News

Aman Sehrawat: అమన్ కూడా బరువు తగ్గాడా? వేటు నుంచి తప్పించుకునేందుకు 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడా?

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:44 PM

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఎదురైన పరిస్థితి చాలా మందికి మేలుకొలుపుగా మారింది. కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ పతకం సాధించే అవకాశం కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులకు ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Aman Sehrawat: అమన్ కూడా బరువు తగ్గాడా? వేటు నుంచి తప్పించుకునేందుకు 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడా?
Aman Sehrawat sheds 4.6 kg in 10 hours

పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics) రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat)కు ఎదురైన పరిస్థితి చాలా మందికి మేలుకొలుపుగా మారింది. కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ పతకం సాధించే అవకాశం కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులకు ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాంస్య పతకం సాధించిన మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ (Aman Sehrawat) కూడా ఈ అదనపు బరువు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడట. కఠినంగా కసరత్తులు చేసి ఏకంగా 4.6 కిలోల బరువు తగ్గాడట (Over Weight).


సెమీస్ మ్యాచ్‌లో ఓటమి చవి చూసిన అమన్ కాంస్య పతక పోరు (Bronze Medal)లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. అతడు 57 కేజీల విభాగంలో తలపడుతున్నాడు. అయితే శుక్రవారం ఉదయం బరువు చూసుకుంటే అమన్ 61.5 కిలోలు ఉందట. అప్పటికి మ్యాచ్ జరిగేందుకు 10 గంటల సమయం మాత్రమే ఉందట. ఆ పది గంటల్లోనే అమన్ ఏకంగా 4.5 కిలోల బరువును కోల్పోవాల్సి ఉంది. అందుకోసం అమన్ ముందుగా గంట పాటు వేడినీళ్ల స్నానం చేశాడట. ఆ తర్వాత ఆగకుండా గంట పాటు ట్రెడ్‌మిల్ రన్నింగ్ చేశాడట. ఆ తర్వాత జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కవుట్లు చేశాడు. అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత ఐదు సెషన్ల పాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్ చేశాడు.


చివరి సెషన్ సానా బాత్ పూర్తయ్యే సరికి అమన్ 900 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో 15 నిమిషాల పాటు నెమ్మదిగా జాగింగ్ చేశాడు. మొత్తానికి శుక్రవారం ఉదయం 4.30 గంటలకు బరువు చూస్తే 56.9 కిలోలకు వచ్చాడు. అంటే ఉండాల్సిన దాని కంటే ఒక 100 గ్రాములు తక్కువగానే ఉన్నాడు. దీంతో అమన్, ఇతర సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పది గంటల్లో అమన్ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదట. ఇంత కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 24 రోజులు) అమన్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి..

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు


పస్తులుండి.. చందాలు పోగేసి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 10 , 2024 | 04:44 PM