Babar Azam: కెప్టెన్సీ వదిలేసిన బాబర్ ఆజామ్.. అయినా ఆగని ట్రోలింగ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:43 PM
పాకిస్తాన్ వరుస వైఫల్యాల కారణంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. వన్డ, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) పేలవ ప్రదర్శన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ (Captaincy) బాధ్యతల నుంచి వైదొలిగాడు. వన్డ, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. కాగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం బాబర్‌కు ఇది రెండోసారి.
``పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నా. ఇలాంటి గౌరవం అందించినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఇక, కెప్టెన్సీకి దూరంగా ఉంటా. పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా`` అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత కూడా బాబర్‌పై ట్రోలింగ్ (Trolling on Babar Azam) ఆగడం లేదు. అతడిపై మీమర్లు, నెటిజన్లు విరుచుకుపడుతూనే ఉన్నారు. రెండోసారి కెప్టెన్సీ వదిలేయడం గురించి కామెంట్లు చేస్తున్నారు.
``బాబర్ ఇప్పటివరకు ఆరు మెగా టోర్నీల్లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక్క టోర్నీలో కూడా గెలిపించలేదు``, ``ఏడాదిలో రెండోసారి కెప్టెన్సీని వదిలేసిన తొలి ఆటగాడు బాబర్. అత్యంత చెత్త కెప్టెన్``, ``నాకు తెలిసి మరోసారి బాబర్ కెప్టెన్సీ తీసుకుంటాడేమో``, ``చాలా మంచి నిర్ణయం, ఇప్పటికైనా అతడు బ్యాటింగ్‌పై దృష్టిపడతాడేమో``, ``బాబర్ పాక్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం ప్రత్యర్థి జట్లకు చేదు వార్తలాంటిదే. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో రెండు పాయింట్లు సులభంగా అందించే కెప్టెన్ లేకపోవడం వారికి ఇబ్బందే`` అంటూ బాబర్‌పై మీమర్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..