Share News

షకీబ్‌కు విరాట్‌ బహుమతి

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:40 AM

కెరీర్‌లో చివరి టెస్టు ఆడేసిన బం గ్లా దిగ్గజ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు విరాట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ ముగిశాక అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో కోహ్లీ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను...

షకీబ్‌కు విరాట్‌ బహుమతి

కెరీర్‌లో చివరి టెస్టు ఆడేసిన బం గ్లా దిగ్గజ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు విరాట్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ ముగిశాక అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో కోహ్లీ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను తీసుకెళ్లాడు. నేరుగా షకీబ్‌ దగ్గరికి వెళ్లి అతడికి తన బ్యాట్‌ను బహుమతిగా అందించాడు. ఆ తర్వాత అతడి భుజంపై చే యి వేసి కాసేపు ఆప్యాయంగా సంభాషించడం కనిపించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీ్‌సకు ఎంపిక కాకపోతే ఇదే తన చివరి టెస్టు కానుందని షకీబ్‌ ఇదివరకే ప్రకటించాడు.

Updated Date - Oct 02 , 2024 | 01:40 AM