Share News

Eng Vs Pak Test: వామ్మో.. బెన్ స్టోక్స్ ఏంటి ఇలా ఔటయ్యాడు! చేతిలోని బ్యాట్ జారడంతో..

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:12 PM

ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఊహించని రీతిలో అవుటయ్యాడు. క్రీజ్ దాటి ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి బ్యాట్ చేర్జాకుని చివరకు స్టంప్ ఔట్ అయ్యాడు. డ

Eng Vs Pak Test: వామ్మో.. బెన్ స్టోక్స్ ఏంటి ఇలా ఔటయ్యాడు! చేతిలోని బ్యాట్ జారడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ముల్తాన్ వేదికగా పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీంలో స్పిన్నర్లు నోమాన్ అలీ, సాజిద్ ఖాన్ చేరికతో దూకుడు మీదున్న పాకిస్థాన్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో 152 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. అయితే, తొలి నుంచి పాక్ ఆధిపత్యం కనిపించిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ ఔటైన విధానం నెట్టింట వైరల్‌గా మారింది. బెన్ స్టోక్స్ వికెట్ చేజార్చుకున్న తీరు పాక్ అభిమానులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తుంటే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు (Viral).

Pro Kabaddi League: కబడ్డీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తెలుగు టైటాన్స్ వైపే అందరి చూపు..


నోమాన్ బౌలింగ్‌లో 28వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ ఊహించని రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. సాధారణంగా స్వీప్, లేదా రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించే అతడు ఈసారి క్రీజ్ దాటి ముందుకొచ్చి మిడ్ వికెట్ మీదుగా బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడి బ్యాలెన్స్ తప్పడంతో బ్యాట్ చేజారి గాల్లోకి ఎగిరి కిందపడింది. దీంతో, బెన్ స్టోక్స్ కూడా క్షణకాలం పాటు బిత్తరపోయాడు. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న వికెట్ కీపర్ రిజ్వాన్ వెంటనే బంతిని పట్టుకుని స్టంప్స్ కేసి కొట్టి వికెట్ తీసాడు. కొత్త ప్లేయర్ రీతిలో వికెట్ చేజార్చుకోవడంతో నమ్మలేనట్టు చూస్తుండిపోవడం బెన్ స్టోక్స్ వంతైంది. 36 బంతుల్లో 37 పరుగులతో మంచి ఫాంలో ఉండగా వికెట్ చేజార్చుకున్న స్టోక్స్ చివరకు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.

ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..


ఈ ఇన్నింగ్స్‌లో నోమాన్ చెలరేగిపోయాడు. 46 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టీం వెన్ను విరిచాడు. ముందెన్నడూ చూడని రీతిలో విజృభించాడు. ఈ మ్యాచ్‌లో రెండు స్పిన్నర్లతో దిగాలన్న వ్యూహం ఫలించడంతో పాక్ శిబిరంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. నోమన్ అలీ, సాజిద్ ఖాన్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. ఇంగ్లండ్ వికెట్‌లన్నీ వీరే తమ ఖాతాలో వేసుకున్నారు. నొమాన్ 11 వికెట్లు, సాజిద్ 9 వికెట్లు పడగొట్టారు. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి నుంచి తడబాటుకు లోనైంది. రెండో ఓవర్‌లో సాజిద్ ఓలీ పోప్‌ వికెట్ తీశాడు. అది మొదలు వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరకు చతికిలపడింది. తొలి రోజు వ్యూహాన్నే అమలు చేస్తూ స్వీప్, రివర్స్ స్వీప్‌తో చెలరేగిపోదామనుకున్న ఇంగ్లండ్ వ్యూహాం బెడిసికొట్టింది. ఇక రావల్పిండిలో జరగనున్న మూడో టెస్టులో ఈ సిరీస్‌ విజేతలు ఎవరో తేలిపోతుంది.

Read Latest and Sports News

Updated Date - Oct 18 , 2024 | 05:17 PM