SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. రాచకొండ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Mar 26 , 2024 | 09:55 PM
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. రాచకొండ సీపీ తరుణ్ జోషీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా.. బుధవారం (27/03/24) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. రాచకొండ సీపీ తరుణ్ జోషీ (Rachakonda CP Tarun Joshi) భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. మొత్తం 28వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో భారీగా పోలీసులను మోహరించనున్నట్టు తెలిపారు.
Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?
గేట్ నంబర్ 1 వద్ద కేవలం ప్లేయర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తరుణ్ జోషీ పేర్కొన్నారు. స్టేడియంలో మొత్తం 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే తాము బాంబ్ & డాగ్ స్క్వాడ్‌లతో స్టేడియం మొత్తం తనిఖీలు నిర్వహించామని అన్నారు. స్టేడియం లోపల అక్టోపస్ బలగాలతో బందోబస్తు సిద్ధం చేశామన్నారు. ఈవ్‌టీజింగ్ కోసం షీ టీమ్స్‌తో (She Teams) నిఘా పెడతామని, మహిళల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పుకొచ్చారు. సిగరెట్స్, లైటర్స్, షార్ప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్స్ వంటి వస్తువులను స్టేడియంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు.
IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.1 కోటి ఢమాల్.. భర్త చేసిన పనికి పాపం భార్య!
మ్యాచ్‌కి మూడు గంటల ముందే స్టేడియంలోకి అనుమతిస్తామని తరుణ్ జోషీ చెప్పారు. కార్ పాస్‌లు ఉన్నవారు.. గెట్ నంబర్ 1 & 2 నుంచి వెళ్లి, A & Bలో స్టేడియం లోపల పార్క్ చేసుకోవాలని సూచించారు. హోటల్ నుంచి ఉప్పల్ స్టేడియం వచ్చే వరకు ప్లేయర్ల కోసం బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే సమయంలో బ్లాక్ టికెట్లు (Black Tickets) విక్రయించేవారికి సీపీ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ టికెట్ అమ్మకాలపై కచ్ఛితంగా నిఘా ఉంటుందని.. బ్లాక్ టికెట్ అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని.. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి