T20 World Cup: అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకంటే ఘోర అన్యాయం ఇంకోటి ఉండదు
ABN , Publish Date - Apr 29 , 2024 | 03:30 PM
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు మరెంతో సమయం లేని తరుణంలో.. మాజీ ఆటగాళ్లు తమదైన సూచనలు ఇస్తున్నారు. ఏయే ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం భారత జట్టుని ప్రకటించేందుకు మరెంతో సమయం లేని తరుణంలో.. మాజీ ఆటగాళ్లు తమదైన సూచనలు ఇస్తున్నారు. ఏయే ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్న శివమ్ దూబేకి (Shivam Dube) టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని కోరాడు. అలా కాకుండా అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకంటే ఘోర అన్యాయం ఇంకోటి ఉండదని కుండబద్దలు కొట్టాడు.
విరాట్ కోహ్లీ ‘స్ట్రైక్ రేట్’పై విమర్శలు.. గౌతమ్ గంభీర్ చురకలు
‘‘ఐపీఎల్ 2024లో శివమ్ దూబే ఆడుతున్న తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. అతడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడ్ని టీ20 వరల్డ్‌కప్ కోసం అమెరికా, వెస్టిండీస్‌లకు పంపించడమే కాదు.. ప్లేయింగ్ 11లో ఆడించాలని నేను కోరుతున్నాను. కెప్టెన్ గానీ, టీమ్ మేనేజ్‌మెంట్ గానీ, ఏ సెలక్టర్ గానీ అతడ్ని విస్మరించకూడదు. ఇప్పుడున్న టీమిండియా ఆటగాళ్లలో అతనికంటే మంచి హిట్టర్ మరొకరు లేరు. ఒకవేళ దూబేని బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకన్నా ఘోర అన్యాయం ఇంకోటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. అతడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్‌కప్‌లో ఆడించాల్సిందేనని.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి బలమైన సందేశాన్ని పంపాడు.
సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
మరో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) సైతం శివమ్ దూబేకి మద్దతుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో దూబేలాంటి ఆటగాడు అవసరమని.. బౌలర్లతో పాటు స్పిన్నర్లపై కూడా అతడు విరుచుకుపడతాడని అభిప్రాయపడ్డాడు. మైదానంలో భారీ సిక్సులతో చెలరేగుతున్న అతని ఆట ఎంతో అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. లో ఫుల్ టాస్ బంతుల్ని సైతం అతడు సిక్సులుగా మలుస్తున్నాడని, ఇలా చేయడం చాలా కష్టమని తెలిపాడు. తన పాదాల్ని ఎక్కువగా ఉపయోగించకుండానే.. నిల్చున్న చోటు నుంచి భారీ సిక్సులు బాదుతున్నాడన్నాడు. వరల్డ్‌కప్‌కి భారత్ వెళ్తున్నప్పుడు.. జట్టులో అలాంటి ఆటగాడు తప్పకుండా ఉండాల్సిందేనని కైఫ్ నొక్కి చెప్పాడు.
Read Latest Sports News and Telugu News