T20 World Cup: ‘ఆ క్రికెటర్ అవసరమా.. అతని కంటే ఆ ఇద్దరు ప్లేయర్లే బెటర్’
ABN , Publish Date - Apr 28 , 2024 | 04:53 PM
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా..
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా టీమిండియాని (India T20 World Cup Squad) ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో.. జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది? అనే చర్చలు జోరందుకున్నాయి.
రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్
ముఖ్యంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అందునా.. ఆర్సీబీ తరఫున డీకే మంచి ఫినిషర్‌గా సత్తా చాటుతుండటంతో, అతడ్ని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వచ్చిపడుతున్నాయి. ఫ్యాన్స్ దగ్గర నుంచి మాజీల దాకా.. చాలామంది అతని పేరుని సిఫార్సు చేస్తున్నారు. కానీ.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, వరల్డ్‌కప్ విజేత యువరాజ్ సింగ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. అతడ్ని ఎంపిక చేయడం కన్నా, ఫుల్ ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను తీసుకోవడం మేలని సూచించాడు.
ఈ సీజన్‌లో దినేశ్ కార్తిక్ బాగానే ఆడుతున్నాడు కానీ, 2022 వరల్డ్‌కప్ సమయంలో అతడు పెద్దగా రాణించలేదని యువరాజ్ గుర్తు చేశాడు. ఒకవేళ డీకేని ఇండియా స్క్వాడ్‌లో తీసుకొని ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ ఇవ్వకపోతే.. అలాంటప్పుడు అతడ్ని ఎంపిక చేసి ఎలాంటి ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టాడు. రిషభ్ పంత్, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారని.. పైగా వాళ్లు యువ ఆటగాళ్లని పేర్కొన్నాడు. డీకేతో పోలిస్తే.. ఆ ఇద్దరే ఉత్తమమన్న అభిప్రాయాన్ని యువరాజ్ సింగ్ వెల్లడించాడు. గతంలో ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు ఇతర మాజీలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?
కాగా.. తాను మంచి ఫామ్‌లో ఉండటం, తనకు ఫ్యాన్స్‌తో పాటు కొందరు మాజీల నుంచి మద్దతు లభిస్తున్న తరుణంలో.. తాను టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు 100% సిద్ధంగా ఉన్నానని దినేశ్ కార్తిక్ కొన్ని రోజుల క్రితం పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో తనకు భారత్‌కి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే.. తన జీవితంలో అంతకన్నా మరో గొప్ప అనుభూతి ఏమీ ఉండదన్నాడు. అయితే.. తనని ఎంపిక చేయకపోయినా తాను ఫీల్ అవ్వనని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా సెలక్టర్లు మంచి జట్టునే సెలక్ట్ చేస్తారని చెప్పాడు. మరి.. డీకేకి ఛాన్స్ వస్తుందా? రాదా? అనేది వేచి చూడాల్సిందే.
Read Latest Sports News and Telugu News