Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్
ABN , Publish Date - May 20 , 2024 | 07:51 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్-2024లో దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్.. లీగ్ దశలో తన జట్టు సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో (Travis Head) కలిసి హైదరాబాద్ జట్టుకి విధ్వంసకర శుభారంభాలను అందించాడు. అవతల బౌలర్లు ఎవరున్నా సరే.. ఫోర్స్, సిక్స్‌లతో బౌండరీల మోత మోగించేశాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లోనూ ఊచకోత కోశాడు.
ఈ క్రమంలోనే అభిషేక్ ఓ సంచలన రికార్డ్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ అక్షరాల 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉండేది. 2016 సీజన్‌లో కోహ్లీ 38 సిక్స్‌లు బాదాడు. ఇప్పుడు ఆ ఆలైటైమ్ రికార్డ్‌ని అభిషేక్ బద్దలుకొట్టేశాడు. అయితే.. ఈ సీజన్ ఇంకా మిగిలుంది. ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆడబోతున్నాయి. కాబట్టి.. ఈ మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ, అభిషేక్ సిక్స్‌ల మోత మోగించే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ 37 సిక్సులు కొట్టాడు. మరి.. సీజన్ ముగిసేలోపు ఈ సిక్సర్ల రికార్డ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (71) అర్థశతకంతో చెలరేగడంతో పాటు అథర్వ (46), రుస్సో (49), జితేశ్ శర్మ (32) మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించింది. 6 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించడంతో పాటు త్రిపాఠి (33), నితీశ్ రెడ్డి (37), క్లాసెన్ (42) దుమ్ముదులిపేయడంతో.. హైదరాబాద్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.
Read Latest Sports News and Telugu News