Share News

IND vs AUS: పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:03 PM

Boxing Day Test: ఆస్ట్రేలియా జట్టు పంతం పడితే వదలదు. టార్గెట్ చేసి మరీ కొట్టడం కంగారూల స్టైల్. మరోసారి ఇది రుజువైంది. తాము గురిపెడితే వదలమని, గుంపుగా వెళ్లైనా కొట్టేస్తామని ప్రూవ్ చేసింది ఆసీస్. భారత స్టార్ బ్యాటర్‌ను భయపెట్టి ఔట్ చేసింది.

IND vs AUS: పంతం నెగ్గించుకున్న ఆసీస్.. 11 మంది కలసి మరీ..
KL Rahul

KL Rahul: ఆస్ట్రేలియా జట్టు పంతం పడితే వదలదు. టార్గెట్ చేసి మరీ కొట్టడం కంగారూల స్టైల్. మరోసారి ఇది రుజువైంది. తాము గురిపెడితే వదలమని, గుంపుగా వెళ్లైనా కొట్టేస్తామని ప్రూవ్ చేసింది ఆసీస్. ఓ భారత స్టార్ బ్యాటర్‌ను భయపెట్టి ఔట్ చేసింది. ఆ బ్యాటర్ మరెవరో కాదు.. కేఎల్ రాహుల్. బాక్సింగ్ డే టెస్ట్‌లో రాహుల్‌ను లక్ష్యంగా చేసుకొని కంగారూ ఆటగాళ్లంతా సమష్టిగా ముందుకు కదిలారు. ఇతర వికెట్ల కంటే అతడ్నే మెయిన్ ఫోకస్ చేశారు. రాహుల్ పెవిలియన్ చేరే వరకు వాళ్లు విశ్రమించలేదు. ఆ తర్వాత హమ్మయ్యా.. అంటూ రిలాక్స్ అయ్యారు. అంతలా రాహుల్‌ను ఆసీస్ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


సైంధవుడిలా అడ్డుపడతాడని..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసాంతం ప్రతి భారత బ్యాటర్‌కు వేర్వేరు స్కెచ్‌లు వేసుకొని గ్రౌండ్‌లోకి దిగుతోంది ఆస్ట్రేలియా. ఆ ప్లాన్స్‌ను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ అనుకున్నది సాధిస్తోంది. ఉదాహరణకు విరాట్ కోహ్లీకి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్, రిషబ్ పంత్‌కు బౌన్సర్లు, రోహిత్ శర్మకు హార్డ్ లెంగ్త్‌ డెలివరీస్ వేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అలాగే రాహుల్ కోసం భారీ వ్యూహాలు పన్నారు. అయితే అతడు కంగారూల వ్యూహాలను ఎక్కడికక్కడ చిత్తు చేస్తూ వస్తున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 100కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 259 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సిరీస్ ఇంకా ఆసీస్ వశం కాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు. అందుకే ఇవాళ ఆసీస్‌ టీమ్‌లోని 11 మంది కలసి రాహుల్‌ను టార్గెట్ చేశారు.


పుట్టి ముంచుతాడనే భయం!

రాహుల్‌ను క్రీజులో కుదురుకోనివ్వకుండా ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓపెనర్‌గా రాణిస్తున్నా నిన్ను వన్‌డౌన్‌లోకి ఎందుకు పంపారంటూ నాథన్ లియాన్ అతడ్ని స్లెడ్జ్ చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో కేఎల్‌ ప్యాడ్స్‌కు బంతి తగలగానే.. ఔట్ అంటూ కంగారూ ప్లేయర్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. ఇలా కేఎల్ ఆడుతున్నంత సేపు అటు బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు, ఇటు ఫీల్డర్లు అప్పీల్స్, స్లెడ్జ్ చేసుకుంటూ అతడ్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. రాహుల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరగానే సంతోషంలో మునిగిపోయారు. అతడు క్రీజులో ఉంటే భారత్‌ను కాపాడతాడని, తమ పుట్టి ముంచుతాడని తెలిసే టార్గెట్ చేసి మరీ కొట్టారు కంగారూలు.


Also Read:

వాటే షాట్ కోహ్లీ.. కడుపు నిండిపోయింది బంగారం

టీమిండియా కొంపముంచిన జైస్వాల్.. ఆసీస్ నెత్తిన పాలు

నల్ల బ్యాండ్లతో బరిలోకి భారత ప్లేయర్లు.. ఎందుకు ధరించారంటే..

For More Sports And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 04:07 PM