Gautam Gambhir: గంభీర్‌కు బీసీసీఐ మూడు ప్రధాన ప్రశ్నలు.. అవేంటంటే?
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:38 PM
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రేసులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం..
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రేసులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తదుపరి కోచ్‌ను నియమించే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే.. క్రికెట్ సలహా కమిటీ (CAC) ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో గౌతమ్ గంభీర్ వర్చువల్‌గా పాల్గొనగా.. దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. ఈ సందర్భంగా.. గంభీర్‌కు కమిటీ సభ్యులు మూడు కీలకమైన ప్రశ్నలు సంధించారని తెలిసింది.
అవేంటంటే..
* టీమ్ కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి?
* బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొందరు సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పుడు.. జట్టులో మార్పుల సమయంలో పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు?
* మూడు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లు, వర్క్‌లోడ్, ఐసీసీ ట్రోఫీలు గెలవలేక జట్టు ఎదుర్కొంటున్న వైఫల్యాలను పరిష్కరించడం వంటి అంశాలపై మీ అభిప్రాయాలు ఏంటి?
Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు
ఈ విధంగా మూడు ప్రధాన ప్రశ్నలను కమిటీ సభ్యులు గంభీర్‌ని అడిగారని.. ఒక క్రీడా ఛానెల్ తన కథనంలో వెల్లడించింది. మరి.. వీటికి గంభీర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడనేది మాత్రం వెలుగులోకి రాలేదు. కాగా.. గంభీర్‌కు నిర్వహించిన ఈ ఇంటర్వ్యూతో ఓ రౌండ్ పూర్తయ్యిందని, మరో రౌండ్ కూడా నిర్వహించనున్నారని తెలుస్తోది. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కానీ, గంభీర్‌నే కోచ్‌గా చేయడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. రెండో రౌండ్ పూర్తయ్యాక.. గంభీర్ పేరునే భారత జట్టు హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Read Also: రోహిత్‌తో గొడవ.. బంగ్లా బౌలర్‌పై ఐసీసీ కొరడా
నిజానికి.. ఐపీఎల్-2024కి ముందు ‘తదుపరి హెడ్ కోచ్ ఎవరు’ అనే ప్రస్తావన వచ్చినప్పుడు, గంభీర్ పేరు పెద్దగా వినిపించలేదు. కొందరు భారత మాజీలతో పాటు విదేశీ ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. కానీ.. ఎలాగైతే గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ దిశగా వెళ్తూ వచ్చిందో, క్రమంగా గంభీర్ పేరు మార్మోగడం ప్రారంభమైంది. ఇక ఫైనల్‌లో కేకేఆర్ టైటిల్ సాధించగానే.. గంభీర్ హెడ్ కోచ్ అవ్వడం పక్కా అనే కామెంట్లు గట్టిగా వినిపించాయి. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. అతనే హెడ్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Read Latest Sports News and Telugu News