Share News

Champions Trophy 2025: ఐసీసీ నిర్ణయం వెనుక భారత్.. పాక్‌కు అలా బుద్ధిచెప్పింది

ABN , Publish Date - Nov 15 , 2024 | 07:38 PM

పీసీబీ ట్రోఫీ టూర్ ను రద్దు చేస్తూ ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం వెనుక భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ చొరవతోనే పాక్ చర్యను కట్టడి చేసినట్టు సమాచారం.

Champions Trophy 2025: ఐసీసీ నిర్ణయం వెనుక భారత్.. పాక్‌కు అలా బుద్ధిచెప్పింది
BCCI PCB Chairmens

ముంబై: వివాదాస్పద 'పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్' ప్రాంతాల్లో ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకెళ్లాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై భారత్ కన్నెర్రజేసింది. పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించి 24 గంటలు గడవకముందే భారత క్రికెట్ బోర్డు తెరవెనుక పావులు కదిపింది. పీసీబీ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ ప్రమోషనల్ ఈవెంట్ ను నిలిపివేసేలా గ్లోబల్ బాడీ ఐసీసీని ప్రేరేపించింది. సెక్రటరీ జైషా ఐసీసీ తో మాట్లాడి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


చివరి సారిగా ఈ టోర్నమెంట్ ను 2017లో నిర్వహించారు. అయితే, పాక్ లో పర్యటించలేమని ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేయడంతో ఈ టోర్నమెంట్ మరింత ఆలస్యం కానుంది. తటస్థ వేదికపై ఆడాలని భారత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను పీసీబీ ఇప్పటికే తిరస్కరించింది. ఉన్న విషయాలపైనే క్లారిటీ లేక సతమతమవుతున్న వేళ పాకిస్థాన్ బోర్డు పీవోకేను టార్గెట్ చేస్తూ కొత్త వివాదానికి తెరతీసింది.


‘ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ వదులుకోకుంటే..భారత్‌ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో, ఫైనల్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీకి ప్రతిపాదించాం’ అని ఐసీసీ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ‘ఫైనల్‌ను పాకిస్థాన్‌లో గాకుండా దుబాయ్‌లో నిర్వహిస్తేనే చాంపియన్స్‌ ట్రోఫీ హైబ్రిడ్‌ పద్ధతికి బీసీసీఐ అంగీకరించింది’ అని కూడా ఆ అధికారి తెలిపారు. హైబ్రిడ్‌ విధానంలో నిర్వహణకు అంగీకరిస్తే..పూర్తి ఆతిథ్య రుసుము చెల్లించడంతోపాటు మెజార్టీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహించేలా ఐసీసీ హామీ ఇచ్చినట్టు సమాచారం.

IND vs Aus: ప్రాక్టీస్ సెషన్‌లో దొరికిపోయిన క్రికెటర్.. ఇన్నాళ్లూ ఎలా మేనేజ్ చేశాడబ్బా


Updated Date - Nov 15 , 2024 | 07:39 PM