Team India: ఆ విషయంలో అశ్విన్, జడేజా అలకబూనారా.. క్లారిటీ ఇచ్చిన కోచ్
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:52 PM
సీనియర్ ఆటగాళ్లకు పక్కనబెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడం టీమిండియా జట్టులో ఓ ఇద్దరికి కోపం తెప్పించిందనే విషయంపై చర్చజరుగుతోంది. దీనిపై భారత జట్టు కోచ్ క్లారిటీ ఇచ్చాడు.
ముంబై: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సీనియర్ ప్లేయర్లు అశ్విన్ రవిచంద్రన్, రవీంద్ర జడేజా లేకుండానే ముగించారు. దీంతో సెలక్టర్ల వైఖరిపై వీరిద్దరూ కోపంగా న్నారని ఆ మధ్య వార్తలు పుట్టుకొచ్చాయి. సీనియర్లైన తమను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో అవకాశం కల్పించడపై వీరు అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ క్లారిటీ ఇచ్చారు. క్యాన్ బెర్రాలో రెండు రోజుల పాటు జరగనున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కు ముందు అభిషేక్ నాయర్ విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
టీమిండియా చర్య అశ్విన్, జడేజాలకు కోపం తెప్పించిందా అనే ప్రశ్నపై వివరణ ఇస్తూ ఆ ఇద్దరికీ అసలేమాత్రం గర్వం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ప్రయోజనాలనుు తప్ప మరే ఆలోచన చేయరన్నారు. అలాంటి ఆటగాళ్లు దొరకడం తమ అదృష్టం అంటూ వ్యఖ్యానించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు అవసరాల గురించే ప్లేయర్లు ఆలోచిస్తారన్నారు.
గౌతం భాయ్ చెప్పిందే వేదం..
జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నా వారు మన పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు అది చాలా కష్టంగా మారుతుంది. జడ్డూ, అశ్విన్ లాంటి తెలివైన ఆటగాళ్లు మాకున్నారు. గౌతం భాయ్ నమ్మినదాన్నే టీమ్ మొత్తం అనుసరిస్తుంది. ప్రస్తుతం మాకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తున్నారనే విషయం చాలా సంతోషంగా ఉంది. ఎలా గెలవాలనే విషయంపైనే మా ఆటగాళ్ల ఫోకస్ మొత్తం ఉంటుందన్నారు.
అదే వారికి చివరి మ్యాచ్..
అశ్విన్, జడేజాలను రంగంలోకి దింపాలని జట్టు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు బౌలర్లు లేకపోవడంతో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. అశ్విన్ జడేజా చివరిసారిగా జనవరి 2021లో గాబా టెస్టులో ఆడిన సంగతి తెలిసిందే. జడేజాకు ఫ్రాక్చర్ కాగా, అశ్విన్‌కు వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అశ్విన్ టెస్టుల్లో 3474 పరుగులు, 470 వికెట్లు తీశాడు. జడేజా 3235 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అడిలైడ్ టెస్టులో టీమిండియా ఏ కాంబినేషన్లో ఆడుతుందో చూడాలి.