Share News

CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ABN , Publish Date - May 10 , 2024 | 07:17 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్..

CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్-2024లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్ జీటీకి ఎంతో కీలకమైంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. తప్పకుండా గెలిచి తీరాలి. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో జీటీ జట్టు రంగంలోకి దిగుతోంది. అటు.. చెన్నై జట్టు ఈ మ్యాచ్ ఓడినా, ప్లేఆఫ్స్ ఆశలు మాత్రం సజీవంగానే ఉంటాయి.

ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య ఇదివరకే ఒక మ్యాచ్ జరిగింది. అందులో సీఎస్కే పూర్తి ఆధిపత్యం చెలాయించి, జీటీని ఘోరంగా ఓడించింది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే 206/6 స్కోరు చేయగా.. జీటీ 143/8 స్కోరుకే పరిమితమై, 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పుడు గుజరాత్ అందుకు ప్రతీకారం తీర్చుకొని, తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఒకవేళ జీటీ ఈ మ్యాచ్ గెలిస్తే.. అధికారికంగా ఎలిమినేట్ అవ్వకుండా, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. మరి, ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో జీటీ గెలుస్తుందా? సీఎస్కే లాంటి జట్టుని ఓడించగలుగుతుందా? అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.


తుది జట్లు

సీఎస్కే: రుతురాజ్‌ గైక్వాడ్‌(కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎం.ఎస్‌.ధోని, మిచెల్‌ శాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌

జీటీ: శుభ్‌మన్‌గిల్‌(కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మ్యాథ్యూ వేడ్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ, కార్తిక్‌ త్యాగి

Updated Date - May 10 , 2024 | 07:17 PM