Share News

Cricket News: రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..

ABN , Publish Date - Dec 22 , 2024 | 09:19 AM

Cricket News: క్రికెట్ నుంచి అతడు రిటైరై చాలా కాలం అవుతోంది. కానీ స్టన్నింగ్ బాడీతో పిచ్చెక్కిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ రాక్షసుడు అనేది ఇప్పుడు చూద్దాం..

Cricket News: రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..
Faf Du Plessis

క్రికెట్‌లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొందరు మాత్రమే తమదైన ముద్ర వేస్తుంటారు. అందునా ఇంకొందరు ఎవర్‌గ్రీన్ ప్లేయర్లుగా మిగిలిపోతారు. అలాంటి అసాధారణ క్రికెటర్స్‌లో అతనొకడు. బ్యాట్ పట్టి బరిలోకి దిగాడా.. బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించడం అతడి స్టైల్. సింగిల్స్, డబుల్స్‌కు చాలా దూరంగా ఉండే ఆ బ్యాటింగ్ పిచ్చోడు.. బౌండరీలు, సిక్సులతోనే డీల్ చేస్తాడు. భారీ షాట్లతో అపోజిషన్ టీమ్ నుంచి క్షణాల్లో మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. అతడు వస్తున్నాడంటేనే ప్రత్యర్థులు వణికిపోతారు. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే ఇంకా ఫిట్‌నెస్‌ మెయింటెయిన్ చేస్తున్న అతడు.. స్టన్నింగ్ బాడీతో అభిమానులను పిచ్చెక్కిస్తున్నాడు.


ఏం బాడీ బాస్!

ఒంటి నిండా టాటూలతో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన ఆ క్రికెటర్ మరెవరో కాదు.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఈ ప్రొటీస్ ప్లేయర్.. అటు సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్‌తో పాటు ఇటు భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఈ రెండు లీగ్స్ కోసం తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. అందులో భాగంగానే జిమ్ వర్కౌట్స్ చేయడంతో పాటు ఫుట్‌బాల్ లాంటివి ఆడుతూ శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకుంటున్నాడు. అతడి వర్కౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో స్టన్నింగ్ బాడీతో అతడు మెస్మరైజ్ చేస్తున్నాడు. కూలింగ్ గ్లాసెస్, నెత్తి మీద క్యాప్‌తో హీరోలకు మించిన లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు డుప్లెసిస్.


ఈ వయసులోనూ అంత ఫిట్‌గా..

40 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌నెస్ ఎలా సాధ్యం అంటూ డుప్లెసిస్‌ ఫొటోలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుర్ర ప్లేయర్ల కంటే ఫిట్‌గా, స్టైలిష్‌గా ఉన్నావ్.. నువ్వు గ్రేట్ బాస్ అని మెచ్చుకుంటున్నారు. ఇంత ఫిట్‌నెస్ ఉంది కాబట్టే ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో అతడు టాప్ లెవల్‌లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. యువ ఆటగాళ్లు అతడ్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలని సూచిస్తున్నారు. అతడి జోరు చూస్తుంటే ఇంకో నాలుగేళ్లు ఆడేలా ఉన్నాడని అంటున్నారు. కాగా, గత ఐపీఎల్ వరకు ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఆడుతూ వచ్చిన డుప్లెసిస్..రీసెంట్‌గా జరిగిన మెగా ఆక్షన్‌లో రూ.2 కోట్ల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడుబోయాడు.


Also Read:

ఊతప్పపై అరెస్ట్‌ వారెంట్‌

విరాట్‌ పబ్‌కు నోటీసులు

అఫ్ఘాన్‌దే వన్డే సిరీస్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 09:24 AM