Gautam Gambhir: మళ్లీ అదే తప్పు చేస్తున్న గంభీర్.. అతడిపై ఎందుకంత ప్రేమ..
ABN , Publish Date - Nov 11 , 2024 | 02:02 PM
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని నుంచి వెనక్కి జరగడు. తాను నమ్మింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడూ ఓ ప్లేయర్ విషయంలో అతడు అలాగే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని నుంచి వెనక్కి జరగడు. తాను నమ్మింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఎవరి మీదైనా అతడికి గురి కుదిరితే వాళ్లకు అండగా నిలబడతాడు. ఏం జరిగినా వాళ్లకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటాడు. అయితే సక్సెస్ వస్తున్నంత వరకు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ కాస్త తేడా వచ్చినా, ఓటములు పలుకరించినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఓ ప్లేయర్ విషయంలో గంభీర్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని నమ్మి గౌతీ అనవసరంగా కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ అదే తప్పు చేస్తున్న గంభీర్‌ను ఎవరు కాపాడతారని అంటున్నారు. అసలు గౌతీ చేస్తున్న ఆ మిస్టేక్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
అంత నమ్మకం దేనికి?
న్యూజిలాండ్ సిరీస్‌లో ఓటమితో నిరాశలో కూరుకుపోయిన భారత టెస్ట్ టీమ్ త్వరలో ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఆల్రెడీ కింగ్ విరాట్ కోహ్లీ కంగారూ గడ్డ మీద వాలిపోయాడు. ఈ సిరీస్‌కు ముందు తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది బీసీసీఐ. ఇందులో గంభీర్ పాల్గొన్నాడు. సిరీస్‌లో రోహిత్ ఆడతాడా? లేదా? విరాట్-హిట్‌మ్యాన్ ఫామ్, కొత్త కెప్టెన్.. ఇలా చాలా విషయాలపై అతడు రియాక్ట్ అయ్యాడు. అంతా బాగానే ఉన్నా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో గౌతీ చేసిన వ్యాఖ్యలు చ్చనీయాంశం అవుతున్నాయి. రాహుల్‌ను అతిగా నమ్మడం మంచిది కాదని, అతడు మళ్లీ ఫెయిలైతే గంభీర్‌కు విమర్శలు తప్పవని అంటున్నారు.
ఫామ్ లేమి
వ్యక్తిగత కారణాల వల్ల పెర్త్ టెస్ట్‌కు రోహిత్ అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. ఇదే విషయంపై గౌతీ స్పందిస్తూ.. ఒకవేళ హిట్‌మ్యాన్ ఆడకపోతే కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లో ఒకర్ని జట్టులోకి తీసుకుంటామన్నాడు. రాహుల్ బ్యాటింగ్ టాలెంట్ గురించి మెచ్చుకుంటూ పలు కామెంట్స్ చేశాడు. అలాంటి బ్యాటర్లు చాలా అరుదు అన్నాడు. దీంతో రోహిత్ ప్లేస్‌లో రాహుల్ ఆడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ రాహుల్ ఫామ్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఇటీవల జరిగిన పలు సిరీస్‌ల్లో అతడు సరిగ్గా ఆడలేదు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో కలిపి ఒక్క ఫిఫ్టీ మాత్రమే కొట్టాడు.
ఎందుకంత ప్రేమ?
న్యూజిలాండ్ సిరీస్‌లో 12 పరుగులు మాత్రమే చేశాడు రాహుల్. ఆస్ట్రేలియా ఏతో జరిగిన టెస్టులో 14 పరుగులు చేశాడు. ఫామ్‌లో లేకపోవడం, వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నా రాహుల్‌కే గంభీర్ మొగ్గు చూపడం హాట్ టాపిక్‌గా మారింది. శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నా అతడ్నే తీసుకుంటామని ఇన్‌డైరెక్ట్‌గా ఎందుకు హింట్స్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు రాహుల్‌పై అంత ప్రేమ అని క్వశ్చన్ చేస్తున్నారు.
ఆ ధైర్యంతోనే..
ఆల్రెడీ కివీస్ సిరీస్ వైఫల్యంతో విమర్శలు వచ్చాయి. ఆసీస్ సిరీస్‌లో కూడా ఓడారంటే గంభీర్ పోస్ట్ ఊస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి టైమ్‌లో ఏం ధైర్యం చూసుకొని ఈ సాహసం అని నిలదీస్తున్నారు నెటిజన్స్. అయితే రాహుల్ టాలెంట్ మీద ఉన్న నమ్మకంతోనే గౌతీ సపోర్ట్‌గా ఉంటున్నాడని.. దీని రిజల్ట్ మున్ముందు చూస్తారని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్లకు గౌతీ అండగా నిలబడ్డాడని.. వాళ్ల మాదిరిగానే రాహుల్ కూడా సక్సెస్ అవుతాడని చెబుతున్నారు. మరి.. రాహుల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
Also Read:
టీమిండియాకు కొత్త కెప్టెన్.. అంతా అతడే చూసుకుంటాడు: గంభీర్
తప్పంతా నాదే.. వాళ్లకు తిట్టే హక్కు ఉంది: గంభీర్
స్టార్టప్ దశ మార్చేసిన ధోని
For More Sports And Telugu News