Share News

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కెప్టెన్.. అంతా అతడే చూసుకుంటాడు: గంభీర్

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:35 AM

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియాను ఎవరు ముందుండి నడిపిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరమవడం ఖాయంగా కనిపిస్తుండటంతో అతడి స్థానంలో ఎవర్ని సారథిగా నియమిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కెప్టెన్.. అంతా అతడే చూసుకుంటాడు: గంభీర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది టీమిండియా. త్వరలో ఆరంభమవనున్న ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అసలే న్యూజిలాండ్ చేతుల్లో సిరీస్ ఓటమితో తీవ్ర విమర్శలపాలవుతుండటంతో కంగారూలపై గెలిచి తీరాల్సిన పరిస్థితి. అయితే ఆ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. భార్య రితిక త్వరలో మరో బిడ్డకు జన్మను ఇవ్వనుండటంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట. దీంతో అతడు ఆడకపోతే రీప్లేస్‌మెంట్‌గా ఎవర్ని తీసుకోవాలనేది ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు అర్థం కావడం లేదు. అదే టైమ్‌లో జట్టు సారథ్య పగ్గాలు ఎవరికి ఇవ్వాలనేది కూడా అంతు పట్టడం లేదు. ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతం గంభీర్ రియాక్ట్ అయ్యాడు.


అతడికే పగ్గాలు

పెర్త్ టెస్ట్‌కు రోహిత్ గనుక దూరమైతే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకుంటామని గంభీర్ తెలిపాడు. ఆసీస్ టూర్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్ ఓటమి, రోహిత్-కోహ్లీ ఫ్యూచర్.. ఇలా చాలా విషయాలపై స్పందించాడు. ఆసీస్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఒకవేళ రోహిత్ గైర్హాజరైతే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తాడని క్లారిటీ ఇచ్చాడు. టెస్ట్ టీమ్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని.. కాబట్టి హిట్‌మ్యాన్ లేకపోతే అతడే జట్టును ముందుండి నడిపిస్తాడని, అంతా చూసుకుంటాడని స్పష్టం చేశాడు.


ఆకలితో ఉన్నారు

పెర్త్ టెస్ట్‌లో రోహిత్ ఆడతాడా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నాడు గంభీర్. అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నామని చెప్పాడు. సిరీస్ మొదలయ్యే సమయానికి అన్ని విషయాలు సెట్ అవుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కివీస్ సిరీస్‌లో ఓటమి తమను బాధించిందన్నాడు గంభీర్. తిరిగి గాడిన పడతామని.. బౌన్స్ బ్యాక్ అవుతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రోహిత్, విరాట్ ఫామ్ గురించి తాను టెన్షన్ పడట్లేదన్నాడు. వాళ్లు చాలా గట్టోళ్లని.. కెరీర్‌లో ఎంతో సాధించారన్నాడు. ఇద్దరూ ఎంతో ఆకలితో ఉన్నారని.. పరుగులు చేయాలి, గెలవాలనే కసి, తపన ఇంకా తగ్గలేదన్నాడు గౌతీ.


Also Read:

తప్పంతా నాదే.. వాళ్లకు తిట్టే హక్కు ఉంది: గంభీర్

స్టార్టప్ దశ మార్చేసిన ధోని.. చిన్న సాయంతో వేల కోట్లు

మెక్‌స్వీని, ఇన్‌గ్లిస్‌లకు పిలుపు

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 11:42 AM