Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ‘శ్రీ కృష్ణ’ పోస్ట్.. నెట్టింట్లో వైరల్
ABN , Publish Date - May 27 , 2024 | 12:21 PM
ఐపీఎల్ 2024 టైటిల్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని చిత్తుగా ఓడించి, కేకేఆర్ ఛాంపియన్‌గా..
ఐపీఎల్ 2024 టైటిల్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (26/05/24) జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుని చిత్తుగా ఓడించి, కేకేఆర్ ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో.. ఆ జట్టు సభ్యులందరూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ముఖ్యంగా.. మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను కేకేఆర్‌ని మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌కే టైటిల్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు.
ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?
ఈ ఆనందంలోనే గంభీర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయగా.. అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో.. వారి రథాన్ని నేటికీ శ్రీ కృష్ణుడు నడుపుతాడు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. తాము సరైన నిర్ణయాలే తీసుకోవడం వల్లే ఈ సీజన్‌లో నెగ్గగలిగామని, తమకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉన్నాయన్న అర్థం వచ్చేలా గంభీర్ ఆ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ స్ఫూర్తిదాయకంగా ఉండటంతో.. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ని నెటిజన్లు షేర్ చేస్తూ.. ‘జై శ్రీ కృష్ణ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?
కాగా.. గతంలో గంభీర్ కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు రెండు టైటిళ్లు (2012, 2014) సాధించి పెట్టాడు. ఇప్పుడు ఈ సీజన్‌లో మెంటార్‌గా తిరిగొచ్చిన గంభీర్.. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌కే ట్రోఫీ తెచ్చిపెట్టాడు. దీంతో.. ట్రోఫీ నెగ్గాలని ఎదురుచూస్తున్న కేకేఆర్ పదేళ్ల నిరీక్షణకు చెక్ పడింది. కేకేఆర్ వైస్ కెప్టెన్ నితీశ్ రానాతో పాటు ఇతర ఆటగాళ్లు ఈ గెలుపు క్రెడిట్‌ను గంభీర్‌కి ఇస్తున్నారంటే.. తెరవెనుక అతను చేసిన కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Read Latest Sports News and Telugu News