Share News

Virat Kohli: దయచేసి కోహ్లీని గెలకొద్దు.. కంగారూ టీమ్‌కు లెజెండ్ సూచన

ABN , Publish Date - Nov 17 , 2024 | 03:05 PM

Virat Kohli: ఇప్పుడు క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా బీజీటీ-2024 మీదే ఉంది. త్వరలో మొదలవనున్న ఈ సిరీస్‌లో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతానేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ఓ దిగ్గజ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ జోలికి వెళ్లొద్దని ఆస్ట్రేలియా టీమ్‌కు అతడు సూచించాడు.

Virat Kohli: దయచేసి కోహ్లీని గెలకొద్దు.. కంగారూ టీమ్‌కు లెజెండ్ సూచన

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధారణ మ్యాచుల్లోనే చాలా సీరియస్‌గా ఆడతాడు. ఫుల్ డెడికేషన్‌తో బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇంక బిగ్ టీమ్స్‌తో మ్యాచ్‌లు ఉంటే చెలరేగిపోతాడు. తన బెస్ట్ వెర్షన్‌ను బయటకు తీసుకొస్తాడు. పట్టుదలతో ఆడుతూ జట్టును విజయతీరాలకు చేరుస్తాడు. అయితే గత కొన్నాళ్లుగా అతడు సరైన ఫామ్‌లో లేడు. మళ్లీ మునుపటి కోహ్లీని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదిక అవ్వాలని భావిస్తున్నారు. అయితే టచ్‌లో లేని కింగ్ బౌన్సీ, పేస్ పిచ్‌లపై ఎంతమేర ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే విరాట్ ఫామ్‌పై భారత అభిమానులు, సీనియర్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ క్రమంలోనే కంగారూ టీమ్‌కు ఆ దేశ దిగ్గజ ప్లేయర్ ఒకరు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


వార్ వన్‌సైడ్

కోహ్లీని గెలకొద్దు అని ఆసీస్ ఆటగాళ్లకు సూచించాడు గ్లెన్ మెక్‌గ్రాత్. అతడి జోలికి వెళ్లొద్దని హెచ్చరించాడు. కింగ్‌తో పెట్టుకుంటే ఇంక అంతే సంగతులని అన్నాడు. అతడ్ని రెచ్చగొడితే తాట తీస్తాడని.. గెలుపు గురించి మర్చిపోవాల్సిందేనని చెప్పాడు. స్లెడ్జింగ్ లాంటివి చేస్తే భారత బ్యాటర్ వదిలిపెట్టడని తెలిపాడు. కోహ్లీని గెలికితే చావబాదుతాడని.. అతడు రణం మొదలుపెడితే అంతా వన్‌సైడ్ అయిపోతుందని పేర్కొన్నాడు మెక్‌గ్రాత్. కోహ్లీ దగ్గర స్లెడ్జింగ్ పని చేయదన్నాడు. అతడు తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడని వ్యాఖ్యానించాడు.


స్లెడ్జింగ్‌తో ఆపలేం

‘కోహ్లీపై ఎక్కువ భారం ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్లు అతడ్ని లక్ష్యంగా చేస్తారనడంలో సందేహం లేదు. అయితే కంగారూ టీమ్ మీద అతడికి మంచి రికార్డు ఉంది. స్లెడ్జింగ్‌తో విరాట్‌ను ఆపలేం. అది ఆసీస్‌కు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రెజర్‌లో ఉన్నాడు కాబట్టి అతడ్ని కదిలించకుండా ఆడించాలి. ఒకవేళ కోహ్లీ గానీ పుంజుకుంటే మాత్రం అతడ్ని ఎవరూ ఆపలేరు. విరాట్‌ను స్లెడ్జ్ చేయొద్దని ఇంకోసారి కోరుతున్నా. అతడికి కోపం వస్తే ప్రత్యర్థులకు మూడినట్లే అని అర్థం చేసుకోవాలి’ అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ గురించి మరో కంగారూ మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ తప్పదన్నాడు. టీమిండియాను లైట్‌గా తీసుకుంటే ఆసీస్‌కు డేంజర్ అని హెచ్చరించాడు.


Also Read:

తిలక్ సక్సెస్ వెనుక తెలుగోడు.. వరుస సెంచరీల సీక్రెట్ ఇదే

పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ.. ఏ మొహం పెట్టుకొని ఆడతారో..

ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్

For More Sports And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 03:10 PM