Share News

DC vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 07:19 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఢిల్లీ జట్టు రంగంలోకి దిగింది.

DC vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ
Gujarat Titans Won The Toss And Chose To Field

ఐపీఎల్-2024లో (IPL 2024) భాగంగా.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఢిల్లీ జట్టు రంగంలోకి దిగింది. ఇదివరకే ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా.. అందులో జీటీ విజయం సాధించింది. దీంతో.. ఢిల్లీ ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికితోడు.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైంది.


మరీ ముఖ్యంగా.. ఢిల్లీకి ఈ మ్యాచ్ ఎంతో ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు.. ఇప్పటివరకూ కేవలం మూడు విజయాలే సాధించి, ఐదు పరాజయాల్ని మూటగట్టుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే.. వారి ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. అందుకే.. తమ సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది. మరోవైపు.. జీటీ కూడా పాయింట్ల పట్టికలో దిగువ స్థాయిలో ఉంది కాబట్టి, టాప్-4లో స్థానం పొందాలంటే వరుస విజయాలు సాధించాల్సి ఉంటుంది. అందుకే.. ఢిల్లీపై జట్టు సాధించాలని జీటీ భావిస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, షాయ్ హోప్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అన్రిక్ నోర్ట్యే, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్, వార్యర్

Updated Date - Apr 24 , 2024 | 07:19 PM