Share News

T20 World Cup 2024: గ్రూప్-డిలో పోటా పోటీ... దక్షిణాఫ్రికాకు కష్టమేనా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 02:39 PM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడుతుండగా.. నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూగినియా ఉన్నాయి. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.

T20 World Cup 2024: గ్రూప్-డిలో పోటా పోటీ... దక్షిణాఫ్రికాకు కష్టమేనా?

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ క్రికెట్ అభిమానులను అలరించింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆ బాధ్యతను తీసుకోబోతోంది. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా టీ20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడుతుండగా.. నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూగినియా ఉన్నాయి. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.

అయితే అన్ని గ్రూపుల కంటే గ్రూప్-డి మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. ఈ గ్రూప్ నుంచి సూపర్-8కు వచ్చే జట్లను ముందే ఊహించడం కష్టం అనే చెప్పాలి. వన్డేల సంగతి పక్కనపెడితే పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ రెండు సార్లు ఓడించింది. గత టీ20 ప్రపంచకప్‌తో పాటు గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. మరోసారి ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దీంతో దక్షిణాఫ్రికా విజేతగా నిలవడం మరోసారి కష్టమే అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా గ్రూప్‌ల జాబితా తెలిసినప్పటికీ టీ20 ప్రపంచకప్ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి 7 గంటలకు ఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 02:39 PM