Share News

IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్‌లో కళ్లు చెదిరే ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:41 PM

క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.

IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్‌లో కళ్లు చెదిరే ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే

క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి. ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు దక్కించుకున్నాయి. విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించి అట్టిపెట్టుకుంది. అయితే విరాట్ రికార్డును బద్దలు కొడుతూ హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా రూ.23 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ రిటెయిన్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఇంతకు ముందు రూ.17 కోట్లతో అత్యధిక రిటెన్షన్‌ ధర పలికిన ఆటగాడి కోహ్లీ ఉండేవాడు. ఆ రికార్డును క్లాసెన్ చెరిపివేశాడు.


రిటెన్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..

1. హెన్రిచ్ క్లాసెన్ (SRH) - రూ.23 కోట్లు

2. విరాట్ కోహ్లీ (RCB) - రూ.21 కోట్లు

3. నికోలస్ పూరన్ (LSG)- రూ.21 కోట్లు

4. పాట్ కమిన్స్ (SRH), సంజు శాంసన్ (RR), యశస్వి జైస్వాల్ (RR), రషీద్ ఖాన్ (GT), జస్ప్రీత్ బుమ్రా (MI), రుతురాజ్ గైక్వాడ్ (CSK), రవీంద్ర జడేజా (CSK) వీళ్లందరినీ ఆయా యాజమాన్యాలు రూ.18 కోట్ల మేర వెచ్చించి అట్టిపెట్టుకున్నాయి.


కాగా పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే నిలుపుదల చేసుకుంది. అది కూడా తక్కువ మొత్తాలతో వీరిని రిటెయిన్ చేసుకుంది. శశాంక్ సింగ్‌ను రూ.5.5 కోట్లకు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను రూ.4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిని రిటెయిన్ చేసుకుంది. మొదటి ఎంపిక అయి రింకూ సింగ్‌కు రూ.13 కోట్లు వెచ్చించింది. కాగా రిటెయిన్, మెగావేలం రెండింటికి కలిపి ప్రతి జట్టు గరిష్ఠంగా రూ.120 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఇక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ ఆప్షన్‌తో కలిపి ఒక జట్టు గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఒక జట్టు తమ ఆటగాళ్లందరినీ రిలీజ్ చేసి ఆర్టీఎం కార్డు ద్వారా మెగా వేలంలో తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది.

Updated Date - Oct 31 , 2024 | 08:42 PM