Share News

MI Vs RCB-IPL: ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్?.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిదంటే?

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:50 PM

ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్ (Toss Tampering) జరిగిందా? అని సందేహం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌ గుర్తించిన ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

MI Vs RCB-IPL: ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్?.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిదంటే?

ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్ (Toss Tampering) జరిగిందా? అని సందేహం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌ గుర్తించిన ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే... ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చారని, ఆయన ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా టాస్‌ని మార్చారని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గాల్లోకి ఎగిరి కిందపడ్డ నాణాన్ని జవగల్ శ్రీనాథ్ తిప్పి మరోవైపు చూపించారని ఆరోపిస్తున్నారు. నిజమేనేమో అనిపించేలా ‘ఎక్స్’లో కొన్ని వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.


అయితే మరో నెటిజన్ షేర్ చేసిన వీడియోలో నాణేన్ని శ్రీనాథ్ మరోవైపు తిప్పలేదని స్పష్టమైంది. ఈ వీడియో మరింత క్లారిటీగా ఉండడంతో ఫలితాన్ని మార్చలేదని నిజనిర్ధారణ జరిగింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ‘కాల్’ ఇచ్చాడనే విషయాన్ని జవగల్ శ్రీనాథ్ మరచిపోయినట్టు వీడియోలో స్పష్టమైంది. క్లారిటీ వీడియో పెట్టిన వ్యక్తి ‘‘టాస్‌కు సంబంధించిన స్పష్టమైన వీడియో ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంటి ఆసుపత్రికి లేదా మానసిక ఆసుపత్రికి వెళ్లండి’’ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.


కాగా గత గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌‌ను ముంబై ఇండియన్స్ అలవోకగా ఛేదించింది. ఇషాన్ కిషర్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ చెలరేగడంతో 16వ ఓవర్‌లో ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. 4 ఓవర్లు వేసి 21 పరుగులు ఇవ్వడంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’

IPL 2024: పిల్లల ఫీజు కోసం డబ్బుల్లేవ్ కానీ.. ధోనీ కోసం రూ.64 వేలు ఖర్చు

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 05:53 PM